ఆంధ్రప్రదేశ్‌

పట్టణ పేదల ఆదాయం 2019 నాటికి రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: రాష్ట్రంలోని 80 లక్షల మంది డ్వాక్రా మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెప్మా డైరెక్టర్ చిన తాతయ్య ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ప్రాంతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారికి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే డ్వాక్రా మహిళల ఆదాయాన్ని 2019 నాటికల్లా రెట్టింపు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్న సంగతిని గుర్తు చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలనేది ఆశయమని, అందులో భాగంగానే ఇసుక తవ్వకాలను మహిళలకు అప్పగించామని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినప్పటికీ మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్లుగా తయారు చేసేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో మన పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని, మన తలసరి ఆదాయం రూ. 1.07 లక్షలు కాగా, పొరుగు రాష్ట్రాల తలసరి ఆదాయం రూ. 1.35 లక్షల నుండి రూ. 1.40 లక్షల వరకు ఉందని మంత్రి చెప్పారు. అలాగే ప్రస్తుతం మన రాష్ట్రంలో పట్టణ పేదల సంవత్సర తలసరి ఆదాయం రూ. 36వేలుగా ఉందని, దీనిని 2019 కల్లా రూ. 72వేలు చేస్తామని మంత్రి తెలిపారు. రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు విపక్షాలు హేళన చేశాయని, నేడు సిఎం రైతులకు రూ. 24వేల కోట్లు, డ్వాక్రా మహిళలు రూ. 10వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు తొలివిడతగా రూ. 3600 కోట్లు విడుదల చేసి వడ్డీతో సహా రుణ విముక్తులను చేస్తున్నామని మంత్రి తెలిపారు.
, రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్నా కూడా హామీలు అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుదే అని మంత్రి నారాయణ కొనియాడారు.