ఆంధ్రప్రదేశ్‌

బలవంతుడిదే ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 3: అనంతపురం జిల్లాలోఉచిత ఇసుక విధానం బడా బాబులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి అనుయాయులు, ద్వితీయ శ్రేణి నాయకులు, బిల్డర్లు, నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు ఉచిత ఇసుక విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వీరందరూ దొరికినకాడికి ఇసుకను తవ్వుకుంటూ దాచుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఉచిత ఇసుకను పోగేసుకుని నిల్వ చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు వారి వారి అనుయాయులు వారి వారి ఖాళీ స్థలాల్లో భారీగా నిల్వలు పోగేసుకుంటున్నారు. దీనిపై ఆయా ప్రాంతాల వారీగా ఎవరైనా ఫిర్యాదు చేసినా అధికారుల నుంచీ ఏ మాత్రం స్పందన రాకపోగా, ఫలితం సైతం కనిపించడం లేదు. ఇలా ఉచిత ఇసుక వ్యవహారంలో సామాన్యుల కంటే బడాబాబులే ఎక్కువగా ఇసుకను తీసుకుని వెళ్తున్నారు. దీంతో సామాన్యులకు ఇసుక దొరకడం గగనమైపోగా, మరోపక్క అధికారులు మాత్రం సామాన్యుల విషయంలో సవాలక్ష నిబంధనలను అమలు చేస్తున్నారు. దీంతోపాటు జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న వారికి, తమ పార్టీకి చెందిన వారికే ఇసుక తరలించడానికి అనుమతులు ఇప్పిస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నాయకులు కానీ, తటస్థులు కానీ వారి సొంత అవసరాలకు ఇసుకను తరలించాల్సి వస్తే అధికారులతో దాడులు చేయించి చుక్కలు చూపిస్తున్నారు. ఇలా ఉచిత ఇసుక రవాణాను అధికార పార్టీ నాయకులు ఇతర పార్టీలపై కక్ష సాధింపుకు సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఇసుక రీచ్‌ల వద్ద అధికార పార్టీ నాయకుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే పలు ప్రాంతాల్లో భవన నిర్మాణదారులు, బిల్డర్లు వారికి అవసరం ఉన్నా లేకున్నా అక్రమ ఇసుక నిల్వలకు తెర లేపారు. ఇందులో సైతం స్థానిక ప్రజా ప్రతినిధుల అనుచరులే చక్రం తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా ఇసుక రీచ్‌ల వద్ద వాహన ఛార్జీలతోపాటు తవ్వకానికి కూలీ ఖర్చులూ అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన ధరల ప్రకారం తవ్వకం, రవాణా ఛార్జీలను వసూలు చేయకుండా అదనంగా వసూలు చేస్తున్నారు. రీచ్‌లకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు రెండు క్యూబిక్ మీటర్ల ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరేసరికి రూ.1400 నుంచీ రూ.1500 ధర పలుకుతోంది. జిల్లాలోని పెన్నా నదీ పరివాహక ప్రాంత ఇసుకకు అత్యధిక ధర పలుకుతుండడంతో పాటు, మంచి డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు పెన్నాను తోడేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉచిత ఇసుక రవాణా వ్యవహారంలో బలవంతుడిదే పైచేయిగా మారుతోంది.