రాష్ట్రీయం

ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటాచోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ ఇన్‌చార్జి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక నిపుణుల బృందం శనివారం ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది. డేటాచోరీ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీగ్రిడ్స్ ఆఫీసుకు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర, శే్వతారెడ్డి, రోహిణి ప్రియదర్శినితో పాటు ఇతర అధికారులు సందర్శించారు. విస్తృతంగా సోదాలు జరిపారు. ఈ కేసుకు సంబంధించి సాంకేతిక నిపుణుల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డేటాచోరీ వ్యవహారానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెజాన్, గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేశామని, ఆ సంస్థల నుంచి వివరణ అందాల్సి ఉందని తెలిపారు. హైకోర్టులో గ్రిడ్స్ సీఈవో అశోక్ వేసిన పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, కంప్యూటర్ డిస్క్‌లు, డివైజ్‌లను న్యాయస్థానానికి సమర్పిస్తామని రవీద్ర వెల్లడించారు. ఫామ్-7 దరఖాస్తు చేపట్టిన అనంతరం తొలిసారిగా శనివారం ఉదయం మాదాపూర్ ఐటీగ్రిడ్స్ కార్యాలయానికి చేరుకున్న సిట్ అధికారులు కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని మిగిలిన కంప్యూటర్లను సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు శుక్రవారం ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఆఫీసు పరిసర ప్రాంతాలకు ఇతరులెవరూ రాకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. హార్డ్ డిస్క్‌లోని డేటాను ఐటీ నిపుణులు విశే్లషిస్తున్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర