రాష్ట్రీయం

ఓటర్ల జాబితాలో నా పేరుందో.. లేదో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: నా ఓటు ఉందో లేదో ఒక సారి చూసుకోవాలని చంద్రబాబు చమత్కరించారు. ఫారం-7 ద్వారా భారీగా దరఖాస్తులు చేయడం అతి పెద్ద నేరమని, దాదాపు 9 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించాలని దరఖాస్తు చేశారని అన్నారు. మంత్రి ఫరూఖ్ ఓటు లేదని, టీడీపీ సీనియర్ నేత ఎడ్లపాటి వెంకటరావు ఓటు లేదని అన్నారు. చివరకు తన ఓటు కూడా ఉందో లేదో పరిశీలించుకోవాలని వ్యాఖ్యానించారు. మీ ఓటు కూడా ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు అంతా ‘జగన్ మాయ’ అయిపోయిందన్నారు. ఆస్తి నా పేరుతో ఉందా, ఓటు ఉందా.. కొట్టేశారా చూసుకోవాలన్నారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ సమయంలో, పడుకునే ముందు మరోసారి చూసుకోవాలన్నారు. మీ కారు, స్కూటర్ మీ పేరుతో ఉందో లేదో కూడా చూసుకోవాలన్నారు. మీ ఇల్లు మీ పేరుతో ఉందా లేక మధ్యలో ఎవరైనా కొట్టేశారా అని చూసుకోవాలన్నారు.