రాష్ట్రీయం

అంతకుమించి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో కుట్రకు సంబంధించిన స్కెచ్‌ను కూడా జతచేసి ఇవ్వటంతోనే వారి బండారం మొత్తం బట్టబయలయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కుట్రకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను దుష్ట చతుష్టయం రూపొందించారని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను దేశం ముందు ఉంచుతున్నానన్నారు. ఈ వ్యవహారంలో ఏమేం చేయాలో అన్నీ వివరంగా ‘స్కెచ్’లో రాశారన్నారు. ఉండవల్లి ప్రజావేదికలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో కుట్రకు సంబంధించిన వివరాలు కూడా జత చేశారని రుజువులతో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను విలేఖరులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 19న వైకాపా నేత విజయసాయి రెడ్డి ఈసీకి ఇవ్వాల్సిన ఫిర్యాదు తయారుచేశారన్నారు. ఏపీ ఇల్లీగల్ యాక్సెస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిడ్యువల్స్ బై తెలుగుదేశం పార్టీ - యాక్షన్ - రిగార్డింగ్ పేరుతో ఫిర్యాదు తయారు చేసి ఇచ్చారన్నారు. ఆ వినతి 19న తయారైనా, ఇచ్చింది 22న అని తెలిపారు. ఈసీకి అందచేసిన వినతిలో కుట్రకు సంబంధించిన స్కెచ్ కూడా జతచేసి ఉందన్నారు. కుట్ర కార్యాచరణను కూడా ఫిర్యాదుతో పాటే అందచేశారన్నారు. ఇక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బయటపడిందన్నారు. ఈ కుట్ర బాహుబలి కుట్రలను మించిపోయిందని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఇంత మహా కుట్ర చూడలేదన్నారు. అయితే ఆ ఫిర్యాదులో పేర్కొన్న విధంగా కేసు నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం ముందుకు రాకపోవడంతో కుట్రను హైదరాబాద్ నుంచి అమలు చేసేందుకు పథకం వేశారన్నారు. విజయసాయి కుట్రను తెలంగాణ పోలీసులు అమలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీల కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఏమి చేయాలి, ఎలా వ్యవహరించాలి అనేది కూడా వివరంగా రాశారన్నారు. సోదాల్లో ఐటి గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి? ఎలా ఇబ్బందులు పెట్టాలన్న వివరాలు ఆ కార్యాచరణలో ఉన్నాయన్నారు. దేశం ముందు ఈ సాక్ష్యాధారాలు ఉంచుతున్నానని, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు వీళ్లని ఛీత్కరించాలని పిలుపునిచ్చారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రాసుకున్నారని, ఎలా సోదా చేయాలి, ఎఫ్‌ఐఆర్ ఎలా రిజిస్టర్ చేయాలి, డేటా ఎలా సీజ్ చేయాలి, ఉద్యోగుల సెల్‌ఫోన్లు లాగేసుకోవడం, వేధింపులు, బెదిరింపులు, సేవా మిత్ర యాప్‌ను పని చేయకుండా నిలిపివేయడం, సేవా మిత్ర కార్యకర్తలను గుర్తించి బెదిరించడం, కోర్టు ద్వారా సీబీఐ విచారణ కోరడం, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడం వంటివి ఆ స్కెచ్‌లో ఉన్నాయన్నారు. ఆధార్ డేటా బేస్, ఎన్నికల కమిషన్ డేటా, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం వీరి దగ్గర ఉన్నట్లు నిరూపించడం, వివిధ రకాల డేటా వాడేందుకు సాఫ్ట్‌వేర్ తయారు చేశానని నిరూపించడం, వీటిని సేవా మిత్ర యాప్ కోసం వాడినట్లు నిరూపించేందుకు పథకం చేశారన్నారు. ఓటర్లను తొలగించడానికి ప్రత్యేక జాబితా తయారు చేసి, ఐటి గ్రిడ్‌కు పంపినట్లు చూపించాలని ఆ స్కెచ్‌లో ఉందన్నారు. టీడీపీ ముఖ్యులు, అధికారులు, మంత్రి లోకేష్, మధ్య వివిధ రకాల్లో మంతనాలు జరిగినట్లుగా చూపించడం వంటివి అందులో ఉన్నాయన్నారు. టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవా మిత్ర, రోల్ ప్లేయర్స్, మోడస్ ఆపరేండి, అఫెనె్సస్ ఇన్వాల్డ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఐటి గ్రిడ్ సోదాల్లో చేయాల్సిన ఫోకస్ పాయింట్లు అనే హెడ్డింగులతో అనుబంధ పత్రాలను తయారు చేశారని వెల్లడించారు. అంతా ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం కుట్ర చేశారన్నారు. మార్చి 8న బీజేపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారని, అందులోనూ అదే సమచారం ఇచ్చారన్నారు. ఇది మూడు పార్టీల మహా కుట్రకు రుజువని వ్యాఖ్యానించారు. ఈసీకి ఇచ్చిన వినతిలో యాక్షన్ ప్లాన్‌ను జతచేయడం ఏమిటని ప్రశ్నించారు. కుట్రలకు కూడా కార్యాచరణ ప్రణాళిక తయారీనా, ఒక రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు అభిమానించే పార్టీపై కుట్ర చేస్తారా అంటూ మండిపడ్డారు.