రాష్ట్రీయం

రాహుల్ సభ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం శనివారం ‘కనీస ఆదాయ వాగ్దానం’ పేరిట నిర్వహించిన సభ విజయవంతమైంది. శంషాబాద్‌లో క్లాసిక్ గార్డెన్స్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం లో నిర్వహించిన సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆ స్థలం నిండిపోవడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కార్యకర్తలు సంతోషించారు. విమానాశ్రయం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి సాయంత్రం 6 గంటలకు చేరుకున్నారు. పార్టీ నాయకులు విమానాశ్రయంలో, సభాస్థలి వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తూర్పారబట్టారు. రాహుల్ హిందీలో చేసిన ప్రసంగాన్ని టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తెలుగులోకి అనువదించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మిత్రత్వం గురించి రాహుల్ చెబుతూ మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్ ఉందని విమర్శించినప్పుడు కార్యకర్తలు కరతాళధ్వనులు చేశారు. రాహుల్ తన ప్రసంగంలో తాము అధికారంలోకి రాగానే పేదలందరికీ కనీస ఆదాయం లభించేలా పథకాన్ని రూపొందిస్తామని ప్రకటించినప్పుడు సభికులు హర్వధ్వనులు చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు సభ విజయవంతం కావడం వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యిందని టీ.పీసీసీ నాయకులు భావిస్తున్నారు. రాహుల్ కొత్త ఉత్సాహం కల్పించారని అన్నారు.
చిత్రం.. శంషాబాద్‌లో శనివారం కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో వేదికపై స్థానిక నేతలతో చేతులు కలిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ