రాష్ట్రీయం

మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘మీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అవినీతి గురించి ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసు, మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్ ఉంది..’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ చేతిలో రిమోట్ ఉన్నందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రాఫెల్ యుద్ధ విమానాల గురించి ప్రశ్నించరని రాహుల్ చెప్పగానే సభికులు కేరింతలు కొట్టారు. శంషాబాద్‌లో టీ.పీసీసీ ఏర్పాటు చేసిన ‘కనీస ఆదాయ వాగ్దాన సభ’కు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని ఆయన విమర్శించారు. అయినా ఏనాడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య మిత్రత్వం ఉన్నందుకే ప్రశ్నించలేదన్నారు. అందుకే పెద్ద నోట్ల రద్దు చేసినా విమర్శించకుండా ‘శభాష్’ అన్నారని ఆయన చెప్పారు. జీఎస్‌టీ రద్దుతో అన్ని వర్గాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా కేసీఆర్ మాత్రం చాలా బాగుందన్నారని ఆయన తెలిపారు. ఇలా కేసీఆర్ ప్రధాని మోదీకి మద్దతుదారునిగా మారారని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పిస్తామన్నారు.
ప్రధానిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది
రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిన ప్రధాని
మోదీని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని రాహుల్ హెచ్చరికగా అన్నారు. ప్రజల గొంతుకను అణచి వేస్తున్నారని, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని ఆయన విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఒక మహిళపై అత్యాచారం చేస్తే ప్రధాని మాట్లాడలేదన్నారు. ప్రధాని మోదీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధం జరుగుతున్నదన్నారు.

చిత్రం.. శంషాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ