రాష్ట్రీయం

వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: పూతలపట్టు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సునీల్‌కు మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ లభించలేదు. జగన్‌ను కలిసేందుకు సునీల్ తన భార్యతో కలిసి హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్ నివాసానికి చేరుకున్నారు. అయితే జగన్ నివాసంలోకి వెళ్ళేందుకు సిబ్బంది నిరాకరించారు. తనకు ఈ దఫా టిక్కెట్ రాదని ప్రచారం జరుగుతున్నందున సునీల్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకుని జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంగళవారం ఆయన రెండున్నర గంటల పాటు బయట వేచి ఉన్నా, సిబ్బంది అనుమతించలేదు. అయితే పార్టీ ముఖ్యులతో జగన్ బిజీగా ఉన్నందున, త్వరలో పిలుస్తామని కార్యాలయం సిబ్బంది వారికి చెప్పి అక్కడి నుంచి పంపించారు.