రాష్ట్రీయం

ఊడిన పట్టా బోల్టు.. ఆగిన కృష్ణా ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్లో మంగళవారం సాయంత్రం లూప్‌లైన్ పట్టా జాయింట్ బోల్టు ఊడిపోయి పట్టా ఒకటి పైకిలేవడంతో తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ గంట పాటు నిలిచిపోయింది. దీని కారణంగా డోర్నకల్ - కాజీపేట సెక్షన్‌లో పలు రైళ్లరాకపోకలకు గంట పాటు ఆటంకం కలిగింది. రైలు కేసముద్రం స్టేషన్లో రెండవ ఫ్లాట్ ఫాంపై ఆగుతున్న క్రమంలో పట్టా జాయింట్ బోల్టు ఉడిపోయి పట్టా మధ్య గ్యాప్ ఏర్పడి, కొద్దిగా పైకి లేచిన విషయాన్ని ప్రయాణికులు గుర్తించి, గార్డుకు చెప్పడంతో రైలును సిగ్నల్ ఇవ్వకుండా ఆపారు. సిబ్బంది వచ్చి బోల్టు బిగించారు. దీనితో సాయంత్రం 4-56 గంటలకు వచ్చిన క్రిష్ణా ఎక్స్‌ప్రెస్ 5-46కు బయలు దేరింది. ఈ రైలు వెనకాలే వస్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ను మహబూబాబాద్‌లో నిలిపివేశారు. అలాగే, పలు గూడ్సు రైళ్లకు అంతరాయం కలిగింది. రైలు వెళ్లిన తరువాత పట్టా జాయింట్‌కు సిబ్బంది పూర్తిస్థాయి మరమ్మతు నిర్వహించారు.

చిత్రాలు.. కేసముద్రంలో నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ (ఇన్‌సెట్‌లో ) * బోల్టు ఊడిపోవడంతో పైకి లేచిన రైలు పట్టా