రాష్ట్రీయం

94 వేసవి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ ఈ సర్వీసులు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య వారానికి ఒక రోజు 26 వేసవి రైళ్లను నడుపుతారు. 08501, 09502 నెంబర్లతో తిప్పుతారు.
శ ఏప్రిల్ 2వ తేదీన విశాఖపట్నంలో రాత్రి 11 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 3న సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే రైలు మరసటి రోజు ఉదయం 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
శ తిరుపతి- విశాఖపట్నం మధ్య 26 రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 08573- 08574 రైళ్లు విశాఖపట్నం- తిరుపతి మ ధ్య నడుస్తాయి. వీటిని ఏప్రిల్ 1 నుంచి జూన్ 24వ తేదీ వరకు నడుపుతారు. ఈ రైళ్లు వారానికి ఒకసారి ఉంటాయి. 1న వి శాఖపట్నంలో రాత్రి 11.55 గంటలకు బ యల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు చేరుకుంటుంది. అదే రైలు తిరుపతిలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
శ మచిలీపట్నం- సికింద్రాబాద్ మధ్య ఎనిమిది వేసవి రైళ్లు ఏర్పాటు చేస్తారు. నెంబర్ 07049- 07050 రైళ్లు వారానికి ఒకరోజు నడుస్తాయి. మచిలీపట్నంలో మధ్యాహ్నం 1.05 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 22.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 23.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఇవి ఏప్రిల్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నడుస్తాయి.
శ నర్సాపూర్- హైదరాబాద్ మధ్య నాలుగు రైళ్లు ఏర్పాటు చేస్తారు. 07258- నర్సాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 3.55 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 7 నుంచి 28 వరకు ఉంటుంది.
శ హైదరాబాద్- విజయవాడ మధ్య నాలు గు రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఏప్రిల్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నడుస్తాయి. 07257 రైలు హైదరాబాద్‌లో రాత్రి 22.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.35 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలు 8 వతేదీ నుంచి 29 వ తేదీ వరకు నడుస్తుంది.
శ జబల్‌పూర్- తిరునెల్‌వేలి (తమిళనాడు) మధ్య వారానికి ఒకరోజు 26 రైళ్లను ఏర్పాటు చేశారు. 02194 రైలు జబల్‌పూర్‌లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4,45 గంటలకు తిరునెల్‌వెళ్ళికి చేరుకుంటుంది. అదే రైలు తిరుగుప్రయాణంలో(02193) తిరునెల్‌వేలిలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరసటి రోజు ఉదయం 11.15 గంటలకు జబల్‌పూర్‌కు చేరుకుంటుంది. రైలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు నడుస్తాయి.