రాష్ట్రీయం

అభ్యర్థుల కోసం అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 13: ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఆయా పార్టీల తరఫున పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల అనే్వషణలో పడ్డాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీతో పాటు కమ్యూనిస్టులు కూడా బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఆయా పార్టీల అధిష్ఠానాలు దృష్టిపెట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీ అభ్యర్థి అవుతారో, ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌లో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఖాయమని మొన్నటి వరకు ప్రచారం జరగ్గా గడిచిన మూడు రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ ఆశావహుల జాబితాలో ఉన్న వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేరు అనూహ్యంగా టీఆర్‌ఎస్ జాబితాలో చేరింది. మరోవైపు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్న నామా నాగేశ్వరరావు పేరు కాంగ్రెస్ జాబితాలో చేరింది. నామినేషన్ల పర్వం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరు ఏ పార్టీలో ఉంటారనేది స్పష్టంగా తేలడంలేదు. మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోనే మకాం వేసి టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాను రాజకీయ రంగప్రవేశం చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో కూడా టీఆర్‌ఎస్ అధినేతకు ఆయన సిఫార్సు చేయించినట్లు సమాచారం. తనకు టికెట్ దక్కకపోతే ఏంచేయాలనే దానిపై కూడా సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు వామపక్ష పార్టీలు కూడా దశాబ్దకాలం తరువాత ఖమ్మంలో ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించడమే కాకుండా ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన అభ్యర్థి కోసం అనే్వషిస్తున్నాయి. ఇదిలావుంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అధిక స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్టవ్య్రాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పోటీపై నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఖమ్మం విషయంలో మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పేర్లతో ఆయా పార్టీల నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.