రాష్ట్రీయం

భారత్-రష్యా మధ్య అవినాభావ సంబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: భారత్-రష్యాల మధ్య అవినాభావ సంబంధం ఉందని తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రష్యాలోని టామ్స్క్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ అండ్రే అంటోనోవ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం భారత్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఈ బృందం బుధవారం హైదరాబాద్ వచ్చింది. గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, భారతదేశం గతంలో యూఎస్‌ఎస్‌ఆర్‌తోనూ, నేడు రష్యన్ ఫెడరేషన్‌తోనూ సత్సంబంధాలు కలిగి ఉందన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నాయన్నారు. బొమ్మల తయారీతో మొదలుకుని ఆటమిక్ ఎనర్జీ వరకు ప్రతి రంగంలో రెండుదేశాల మధ్య వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయన్నారు. మెడికల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వతో టామ్స్క్ రీజియన్ బృందం అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్, నిర్మాణం, విద్య, ఇంధనం, ఆరోగ్యం తదితర రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని టామ్స్క్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ ఆండ్రే ఆంటోనోవ్ తెలిపారు. మెడిసిన్ తదితర రంగాల్లో భారతీయ విద్యార్థులు చాలా మంది తమ దేశంలో చదువుకుంటున్నారని గుర్తు చేశారు.

చిత్రం.. రష్యా టామ్స్క్ రీజియన్ అధికారిక బృందంతో గవర్నర్ నరసింహన్