రాష్ట్రీయం

నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి నియోజకవర్గాలతో సహ మరో ఒకటి లేదా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన బుధవారం పార్టీ నాయకుడు వెదిరె యోగేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తాము పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు ఇస్తే తీసుకుంటామన్నారు. తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఈ దఫా సమయం వృధా చేసుకోదలచుకోలేదన్నారు. ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన చేయలేదన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి త్వరలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆయన చెప్పారు.ప్రచారానికి మూడు కమిటీలు ఏర్పాటు చేశామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. మానిటరింగ్, ఎన్నికల, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పక్కా ప్రణాళికతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. పోటీలో ఉంటేనే భవిష్యత్తులో తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలమని అన్నారు. అమర వీరుల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో పాలన జరగడం లేదని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. వారి ఆకాంక్షల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 6 నుంచి పార్టీ సమావేశాలు నిర్వహించామని ఆయన చెప్పారు. 7న జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఓటీ చేస్తామన్నారు. 16, 17 తేదీల్లో భద్రాచలం, మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర చేపడతామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.
చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్