రాష్ట్రీయం

అక్కడ మోదీకి... ఇక్కడ కేసీఆర్‌కు వైకాపా దాసోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: అక్కడ నరేంద్ర మోదీకి, ఇక్కడ కేసీఆర్‌కు దాసోహం అంటున్న వైకాపా వంటి పార్టీ రాష్ట్రానికి అవసరమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా టీడీపీ నేతలు, బాధ్యులు, బూత్ కన్వీనర్లతో చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లాంటి నేతల వల్ల రాష్ట్రానికి ఉపయోగమా అని ప్రశ్నించారు. బీజేపీ, వైకాపాల మధ్య లాలూచీని ఒక చానల్ తన స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థులపై బలహీన అభ్యర్థులను వైకాపా రంగంలోకి దించుతుందని వెల్లడైందన్నారు. కేసుల్లో ఇరికించి జగన్‌ను దాసోహం చేసుకున్నారని ఆరోపించారు. హిందూజా నుంచి భూములు, ఎదురు డబ్బులు జగన్ వసూలు చేశారన్నారు. ఇచ్చిన భూమిలో జగన్‌కు వాటాలు ఇచ్చారని, మళ్లీ ఆ భూమికి ఎదురు డబ్బులు ఇచ్చారన్నారు. జగన్ దందా, జగన్ మాయ ఏ స్థాయిలో చలాయిస్తారో ఈడీ అధికారి కర్నల్ సింగ్ లేఖ బయటపెట్టిందన్నారు. బీజేపీ, వైకాపా, టీఆర్‌ఎస్ కుమ్మక్కు వ్యవహారం ఈడీ లేఖతో రట్టయిందని వ్యాఖ్యానించారు. మూడు పార్టీల ములాఖత్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారంలో గోబెల్స్‌ను జగన్ మించిపోయారని, వాళ్లు వస్తున్నారు... వీళ్లు వస్తున్నారు అంటూ టీడీపీ నాయకులపై అనుకూల మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలతో పార్టీలో చేర్చుకున్న వారిని కూడా జగన్ మోసం చేశారని, జగన్ చేతిలో మోసపోయామని ఆ నేతలు ఆవేదన చెందుతున్నారన్నారు. మళ్లీ టీడీపీలోకి వస్తామని వాళ్లు చెబుతున్నారన్నారు. వైకాపా పంచిన గోడగడియారాల్లో టీఆర్‌ఎస్ ముద్రలు ఉన్నాయని, గడియారంపై కాగితాన్ని చింపితే కారు బయటపడుతోందన్నారు. వైకాపా జీపుల్లో గులాబీ రంగు, సీట్లపై కారు గుర్తులు ఇవన్నీ ఏమిటని ప్రశ్నించారు. జగన్‌ను కేసీఆర్ డమీని చేశారన్నారు. టీఆర్‌ఎస్, వైకాపా రెండింటికీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిండెంట్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని జగన్ షెల్ కంపెనీల భూములకు కేసీఆర్ కాపలా ఉంటున్నారని, ఆ షెల్ కంపెనీలకు భూ కేటాయింపులను కేసీఆర్ రద్దు చేయకపోవడమే వీరిద్దరి మధ్య ఉన్న లాలూచీకి నిదర్శమని ధ్వజమెత్తారు. జగన్ కేసులు నీరు కార్చేందుకు బీజేపీ, వైకాపా లాలూచీ పడ్డాయని, ఇందులో భాగంగానే కర్నల్ సింగ్ లేఖను రెండేళ్లుగా తొక్కిపట్టారన్నారు. రోజురోజుకూ మోదీ, జగన్‌లో నిస్పృహ పెరుగుతోందని, ఓటమి భయంతో జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులకు సంబంధించి ఇంకా రెండు రోజులే గడువు ఉందని, అర్హులైన అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటర్ల నమోదును కార్యకర్తలు, నేతలు ప్రోత్సహించాలన్నారు. ప్రజాస్వామ్యానికి వైకాపా, బీజేపీ తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. వ్యవస్థల పతనమే వైకాపా, బీజేపీ ఉమ్మడి అజెండా అని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని, వ్యవస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ అని తెలిపారు. టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ఏపీ అభివృద్ధికి చేయూత అందించాలన్నారు. ఎన్నడూ లేనంత ఉత్సాహం కార్యకర్తల్లో ఉందన్నారు. ప్రజల్లో తమ పార్టీపై పూర్తి సానుకూలత ఉందని, ఈ 26 రోజులు కార్యకర్తలు, నేతలు కష్టపడాలని పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లో శ్రేణులు సమన్వయంతో పని చేయాలని, చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించాలన్నారు. టీడీపీ ద్వారానే వచ్చే ఐదేళ్లలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.