రాష్ట్రీయం

నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లోక్‌సభ, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు చివరి దశకు చేరుకుందని, శుక్రవారం ఢిల్లీలో అధిష్ఠానంతో చర్చించి జాబితా ప్రకటించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో గురువారం మాట్లాడుతూ మూడు రోజుల క్రితం జరిగిన పీఈసీ సమావేశంలో ప్రతి అభ్యర్థి గూర్చి చర్చించేందుకు ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని, ఈ ప్యానెల్‌లో ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున నియమించామన్నారు. వారి సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకుంటామని, ఈ నివేదికను శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కార్యదర్శులు ముందుకు తీసుకువెళతామన్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి ఖరారు చేసి, లోక్‌సభ, అసెంబ్లీ జాబితాను ప్రకటిస్తామన్నారు. రాహుల్ ప్రధాని అయిన 100 రోజుల్లో మహిళలకు ఉద్యోగాలు, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ఇచ్చారన్నారు.