రాష్ట్రీయం

సిట్టింగ్‌ల్లో టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలకు టెన్షన్ మొదలైంది. సిట్టింగ్‌లలో టికెట్లు ఎవరికి ఇచ్చేది, నిరాకరించేది పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముఖాముఖిగానే తేల్చిచెప్పనున్నట్టు ప్రకటించడంతో తమ రాజకీయ భవితవ్యంపై వారిలో ఆందోళన నెలకొంది. పార్టీ అధినేత కేసీఆర్ తమకు అన్యాయం చేయరని కొందరు ఎంపీలు ధీమాగా ఉండగా, మరికొందరు మాత్రం తమకు టికెట్ వస్తుందో రాదోనన్న ఆందోళనతో ఉన్నారు. శుక్రవారం లేక శనివారం ఈ రెండు రోజులలోనే సిట్టింగ్‌లతో సమావేశం ఉంటుందని, పిలుపురాగానే రావడానికి అందుబాటులో ఉండాలని సిట్టింగ్ ఎంపీలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. ముందు నిర్ణయించిన మేరకు శుక్రవారం మధ్యాహ్నం సిట్టింగ్ ఎంపీలతో పార్టీ అధినేత కేసీఆర్ భోజనం చేయాల్సి ఉంది. అయితే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన కేసీఆర్ గురువారం సాయంత్రానికి తిరిగి రాకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ఎంపీలతో సమావేశం ఉండకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆదివారం కరీంనగర్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టడానికి అధినేత కేసీఆర్ వెళ్లాల్సి ఉండటంతో శనివారం మధ్యాహ్నం ఎట్టిపరిస్థితుల్లో సమావేశం ఉంటుందని పార్టీ ముఖ్య నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. సిట్టింగ్ ఎంపీలలో ఒకరిద్దరికి మాత్రమే టికెట్ దక్కే అవకాశం లేదని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో అధినేత కేసీఆర్ స్వయంగా వెల్లడించడంతో ఆ ఒకరిద్దరు ఎవరన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్గాల్లో చర్చ మాత్రమే ఉండగా సిట్టింగ్‌లలో మాత్రం తమకు టికెట్ వస్తుందో? రాదోనన్న టెన్షన్‌లో పడ్డారు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును కలిసి ఆరా తీసినా ఆయన అసలు బయటపడటం లేదని సిట్టింగ్ ఎంపీ ఒకరు వాపోయారు. పార్టీ ప్రచార వ్యూహం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై పార్టీ నేతలు, శ్రేణులను చైతన్యపర్చడం వరకు మాత్రమే తనకు సంబంధమని, అభ్యర్థులను అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకే జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కాగా ఆయనకు టికెట్ ఇవ్వడానికి అధినేత కేసీఆర్ సుముఖంగా లేరని పార్టీ వర్గాల్లో వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. తన సన్నిహితునికి టికెట్ ఇప్పించుకోవడానికి కేటీఆర్ చొరవ తీసుకుంటారా? లేక అధినేత నిర్ణయానికే వదిలేస్తారా? అనేది రెండు రోజుల్లో తేలనుంది. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి టికెట్ దక్కదని ప్రచారం జరుగుతోన్నా, టికెట్ తనకే వస్తుందని అధినేత కేసీఆర్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని జితేందర్‌రెడ్డి గురువారం మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం.