రాష్ట్రీయం

పదవులు అనుభవించి ఫిరాయిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘ఇంత కాలం కాంగ్రెస్‌లో రకరకాలైన పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఫిరాయిస్తారా?’ అని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో గురువారం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ చాలా గౌరవం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నతమైన పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీ కష్టకాంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వేయడం భావ్యం కాదన్నారు. దివంగత ఇంద్రారెడ్డి ఆశయాలు సాధించాలంటే టీఆర్‌ఎస్‌లో చేరితేనే సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో సబితను చేర్చుకుని అమర వీరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను అణచివేయాలని ప్రయత్నిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
బెదిరిస్తున్నారు: ఎమ్మెల్యే రోహిత్
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, కార్యకర్తలను బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చేవెళ్ళ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ కొండా విశే్వశ్వర రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. రాబోయే జెడ్‌పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యక్తిగత అజెండాతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. పార్టీ అధిష్టానం వెంటనే చొరవ తీసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కొండా కేంద్ర మంత్రి అవుతారని అన్నారు.
చాలా అన్యాయం : కేఎల్‌ఆర్
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మారడం చాలా అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. పార్టీకి ద్రోహం చేయడమే అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం మాట్లాడుతూ పార్టీ మారుతూ పార్టీపై విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. ఇంత కాలం పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీ ఫిరాయించారని విమర్శించారు.