రాష్ట్రీయం

కరీంనగర్ యూబీఐలో రూ.12 కోట్ల స్కాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.12 కోట్ల కుంభకోణం గురువారం రాత్రి వెలుగు చూసింది. వార్షిక ఆడిట్‌లో భాగంగా హైదరాబాద్ ఆడిట్ అధికారులు ఈ నెల 11వ తేదీ నుండి ఆడిట్ కొనసాగిస్తుండగా 12 కోట్ల రూపాయలు ఎంతకు లెక్క తేలకపోవడంతో చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యూనియన్ బ్యాంక్‌కు రాగానే తానే అత్యాశతో ఇరువురి వ్యక్తులకు 12 కోట్ల డబ్బులు చెల్లించినట్లు ఎటిఎం ఇంచార్జి వెల్లడించినట్లు తెలిసింది. కరీంనగర్ కేంద్రంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ 28 ఎటిఎంలు, బ్రాంచ్‌లకు డబ్బులను ఇచ్చేందుకు బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తి వద్ద దాదాపు రూ.120 కోట్ల నగదు ఉంచినట్లు సమాచారం. అయితే ముంబయి, జగ్దల్‌పూర్‌కు చెందిన ఇరువురు వ్యక్తులు గత కొంత కాలంగా వారం , పది రోజుల వరకు కొంత మొత్తంలో డబ్బులు తీసుకుంటూ లక్షల రూపాయలు చెల్లిస్తూ నమ్మించారు. అదే తరహాలో పెద్ద మొత్తంలో రాబట్టుకునేందుకు స్కెచ్ వేసిన ముంబయి, జగ్దల్‌పూర్‌కు చెందిన ఆ ఇరువురు వ్యక్తులు ఎటిఎంల నిర్వాహకున్ని నమ్మించి పది రోజుల వరకు ఏడు కోట్లకు అదనంగా మరో 35 లక్షలు, 5 కోట్లకు అదనంగా మరో 25 లక్షలు చెల్లిస్తామని నమ్మబలికి వారం, పది రోజుల క్రితం తీసుకెళ్లిన వ్యక్తులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. భారీ మొత్తంలో నగదుకు బాద్యత తీసుకొని ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 28 బ్రాంచ్‌ల ఎటిఎంలకు రోజువారీగా డబ్బులను సరఫరా చేస్తూ కెపాసిటీకి మించి ఉన్న డబ్బులు తిరిగి కరీంనగర్‌కు తీసుకువచ్చి ఎటిఎం ఇంచార్జి నిర్వహణలో భద్రపర్చేవారు. ఈ నెల 11వ తేదీ నుండి కరీంనగర్ యూనియన్ బ్యాంక్‌లో ఆడిట్ కొనసాగుతున్నప్పటికీ నగదు లెక్క తేలకపోవడంతో మూడు రోజులుగా ముప్పుతిప్పలు పడుతూ తలలు పట్టుకుంటున్నా ఆడిట్ సిబ్బంది మేనేజర్‌ను ప్రశ్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం తెలుసుకున్న ఎటిఎంల ఇంచార్జి చేసేదేమీ లేక జరిగిన విషయాన్నంతా పూసగుచ్చినట్లు వెల్లడించారు. రూ.12 కోట్లకు రూ.60 లక్షలు అదనంగా వస్తున్నాయని ఆశపడి నమ్మి ముంబయి, జగ్దల్‌పూర్‌కు చెందిన ఇరువురు వ్యక్తులకు ఈ భారీ మొత్తంలో డబ్బులు అందించినట్లు వెలుగులోకి వచ్చింది. ఎటిఎంల ఇంచార్జి ఈ భారీ స్కామ్‌కు పక్కా ప్రణాళిక వేశారని, ఇందుకు బ్యాంక్‌కు సంబంధించిన మరి కొందరి సహకారం కూడా ఉన్నట్లు గమనించారు. రూ.2 కోట్లకు మించి బ్యాంకుల్లో స్కామ్ జరిగినట్లయితే తమ పరిధిలోకి రాదని, జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్‌బిఐ అధికారులకు వివరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకే సమగ్ర విచారణ కొనసాగిస్తామని కరీంనగర్ యూనియన్ బ్యాంక్‌లో జరిగిన రూ.12 కోట్ల కుంభకోణంపై నిర్వాహకులతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని ఆర్‌బిఐకి వారిని అప్పగించినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా, వార్షిక ఆడిట్ వరకు కూడా బ్యాంకుల్లో జరుగుతున్న లావాదేవీలపై నియంత్రణ కొరవడడం వల్లే బాధ్యతలు వహిస్తున్న మేనేజర్లు, క్యాషియర్లు, ఇతరత్రా సిబ్బంది ఎవరికి వారుగా డబ్బులను అవసరాలకు వాడుకుంటూ ఎప్పటికప్పుడు మళ్లీ అనుమానం రాకుండా అందులో ఆదా చేస్తున్నట్లు ఆడిట్ అదికారుల విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రూ.12 కోట్లను అదనంగా వచ్చే లక్షలకు ఆశపడి ముంబయి, జగ్ధల్‌పూర్‌కు చెందిన ఇరువురు వ్యక్తులకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎటిఎంల ఇంచార్జి బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఈ స్కామ్‌కు తెరతీసినట్లు విచారణలో వెలుగు చూసింది. ఇంకా ఇందుకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.