రాష్ట్రీయం

టార్గెట్16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 16: సార్వత్రిక సమరానికి అధికార టీఆర్‌ఎస్ ఆదివారం నుంచే అంకురార్పణ చేయబోతుంది. ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా పోరుఖిల్లా కరీంనగర్ జిల్లానుంచే ఎన్నికల యుద్ధంలోకి దిగనుండగా, సాయంత్రం 5 గంటలకు మానేరు నది తీరాన ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్‌సభ శంఖారావం పూరించనున్నారు. తెలంగాణ ఆకుపచ్చని రాష్ట్రంగా మరాలంటే, జాతీయ రాజకీయాల్లోక్రియాశీల పాత్ర పోషించాలనే భావనతో ఉన్న అధినేత కల్వకుంట్ల ఈసారి
16 పార్లమెంటు స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహ రచన చేశారు. కేసీఆర్ కోసం ఏర్పాటు చేసిన సభావేదిక ఇప్పటికే సిద్ధం కాగా, సభాస్థలి మొత్తం రాష్టప్రోలీసుల చేతుల్లోకి వెళ్ళింది. మొదటి సభను జిల్లాలో గతమెన్నడూ కనివినీ ఎరుగని రీతిలోనిర్వహించి, ఇతర పార్టీలకు సవాల్ విసరాలనే పట్టుదలతో ఆపార్టీ రాష్ట్ర యంత్రాంగం ఉంది. దీనికి తగ్గట్లుగానే భారీ స్థాయిలో జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు లక్షలకు పైగా మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా, జన సమీకరణ బాధ్యతలు నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేలకు అప్పగించటంతో, రెండు రోజులుగా తమ సెగ్మెంట్లకే పరిమితమయ్యారు. ఇంటికోవ్యక్తిని తరలించటమే లక్ష్యంగా ఊరు, వాడ తిరుగుతున్నారు. ప్రతి గ్రామానికి నాలుగు వాహనాల చొప్పున కేటాయించారు. జన సమీకరణను ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తుండగా, సభ విజయవంతం చేయటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2001 మే 17న ఇదే జిల్లాలోనిర్వహించిన ‘సింహగర్జన’తో ఉమ్మడి పాలకుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించగా, నేడు జరుగనున్న ‘సార్వత్రిక శంఖారావం’తో దేశంలో గుణాత్మక మార్పు తెచ్చే దిశగా అడుగులు వేయబోతున్నట్లు ఆపార్టీ నేతలు ప్రకటించారు. దీంతో ఇప్పటికే పంచాయితీ నుంచి అసెంబ్లీ వరకు అన్ని స్థానాలు గులాబీ జెండాల రెపరెపలతో కిటకిటలాడుతుండగా, ఇదే ఊపుతో పార్లమెంటులో కూడా కారు జోరును కొనసాగించేందుకు ఈసభ ద్వారా మరోసారి కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ నింపబోతున్నారు.

చిత్రం.. సభావేదిక నుంచి ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి ఈటల, మేయర్ రవీందర్‌సింగ్