రాష్ట్రీయం

నాణ్యమైన ఔషధాలను చౌకగా అందుబాటులోకి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఔషధాలను ప్రజలకు చౌకగా అందుబాటులోకి తీసుకుని రావాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సంప్రదా య, జనరిక్ ఔషధాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. శనివారం సరోజిని నాయుడు వని తా ఫార్మసీ మహిళా విద్యాలయం ద్వి దశాబ్ది వా ర్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ నిపుణులకు, వస్తువులకు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలన్నారు. ఎక్కువ మందిని కబలిస్తున్న, అరుదైన వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన ఔషధాలను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణం గా క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని ఆయన తెలిపారు. వీటిని అధిగమించేందుకు తొలుత ఆహారం, జీవన విధానంలో మార్పు అవశ్యకత ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఫార్మా పరిశ్రమ అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పరిశోధన, ఆవిష్కరణపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా జెనరిక్ ఔషధాల తయారీలో మన దేశం అతి పెద్ద సరఫరాదారుగా నిలిచిందన్నారు. ఎయిడ్స్‌ని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న యాంటీ రెట్రో వైరల్ ఔషధాలను భారతీయ ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సర సమైన ధరలకు ఔషధాలు అందిం చి, ప్రాణాలను కాపాడుతున్న భారతీయ కంపెనీల యెమెన్ సర్వీసులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. జెనరిక్ ఔషధాలను అందించడంలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రామాణిక, భారతీయ వైద్య విధానాలపై యువ పరిశోధకులు దృష్టి పెట్టాలని సూచించారు. ఎలాంటి దుష్ప్రభావా లు లేని సంప్రదాయ ఔషధాల సామర్థ్యం, ప్రామాణికత, సమర్థతను తెలిపేందుకు మరిన్ని పరిశోధనలు జారగాలని ఆయన సూచించారు. ఎక్కువ మందిని కబలిస్తున్న వ్యాధులకు తక్కు వ ధరలో నాణ్యమైన మందులను అందుబాటులోకి తేవడమే కాకుండా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య 7 కోట్ల కంటే ఎ క్కువగా ఉందని, దీనిని సేవా మార్గంగా చూడాలని ఆయన ఫార్మా కంపెనీలకు సూచించారు. జనరిక్ ఔషధాలను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని వెం కయ్య నాయుడు సూచించారు. ఫార్మసీ విద్య ను పునరుద్ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ మహా విద్యాలయ చైర్మన్ వీ. వీలరేందర్, కార్యదర్శి ఆర్. సుకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.