రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 16: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకుని అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈసందర్భంగా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజులు సీఎంకు, కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
చిత్రం.. శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు
స్వామివారి ప్రసాదాలను అందజేస్తున్న టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్