రాష్ట్రీయం

గేట్-2019 ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ ఏపీ నిట్ విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం: గేట్-2019 ఆలిండియా మొదటి ర్యాంకును పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న ఏపీ నిట్ విద్యార్థి వైభవ్‌సింగ్ రాజ్‌పుత్ సాధించారు. రాజ్‌పుత్ గేట్-2019 మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో 84.67 శాతం మార్కులు సంపాదించాడు. హర్యానా రాష్ట్రం గురుగావ్‌కు చెందిన రాజ్‌పుత్ తండ్రి హరిసింగ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి కెమికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. తల్లి పూనమ్‌సింగ్ గృహిణి. రాజ్‌పుత్ 10వ తరగతిలో 87 శాతాన్ని, ప్లస్ టూలో 88 శాతం, జేఈఈ మెయిన్స్‌లో 170 శాతం మార్కులు సాధించాడు. గేట్ పరీక్షలకు నాలుగవ సంవత్సరం మొదటి సెమిస్టర్ నుండి సాధన చేశాడు. నోట్ పుస్తకాలు, టెస్ట్ పుస్తకాల ద్వారా పాఠ్యాంశాలపై పట్టుసాధించి అన్ని సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని పెంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజ్‌పుత్ మాట్లాడుతూ గేట్‌లో మొదటి ర్యాంకు రావడం ద్వారా తనకు ప్రభుత్వ ఉద్యోగం, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలైన విశాఖ స్టీల్‌ప్లాంట్, స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థల్లో ఉద్యోగం పొందే అవకాశం లేదా ఐఐటీలో ఎంటెక్ చేసే అవకాశం ఉందన్నారు. ఒక మంచి శాస్తవ్రేత్తగా నిలవాలనేదే తన లక్ష్యమన్నారు. తనకు మొదటి ర్యాంకు రావడానికి సహకరించిన హెచ్‌ఓడీ డాక్టర్ రఫీ మహ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం.. గేట్-2019 ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్
ఏపీ నిట్ విద్యార్థి వైభవ్‌సింగ్ రాజ్‌పుత్