రాష్ట్రీయం

అశ్రునయనాల మధ్య వివేకా అంతిమయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మార్చి 16: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డికి కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతిమవీడ్కోలు పలికారు. శుక్రవారం స్వగృహంలో వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే. సాయంత్రం నుంచి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చిన నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. శనివారం ఉదయం 11.30 గంటలకు పులివెందుల పట్టణం బాకరాపురంలోని వివేకా స్వగృహం నుంచి వివేక అంతిమయాత్ర ప్రారంభమైంది. వివేకా అమర్ రహే, జోహార్ వివేకా అంటూ కార్యకర్తలు దారిపొడవునా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన అంతిమయాత్రలో వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు నడుచుకుంటూ వెళ్లారు.
రాజారెడ్డిఘాట్‌లో తల్లిదండ్రుల సమాధి పక్క వివేకా అంత్యక్రియలు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.
అంతిమయాత్రలో వైఎస్ కుటుంబ సభ్యులు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డి, వైఎస్.విజయమ్మ, వైఎస్.షర్మిళ, వైఎస్.్భరతి, వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్.ప్రకాష్‌రెడ్డి, వైఎస్. ఆనంద్‌రెడ్డి, వైఎస్.మనోహర్‌రెడ్డి, వైఎస్.ప్రమీలమ్మ, మాజీ మంత్రి డిఎల్.రవీంద్రనాధ్‌రెడ్డి, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
చిత్రం.. కడప జిల్లా పులివెందులలో శనివారం జరిగిన వైఎస్.వివేకానందరెడ్డి అంతిమయాత్ర