రాష్ట్రీయం

కష్టానికి కూలి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం/విశాఖపట్నం, మార్చి 17: ఎన్నికల యుద్ధం మొదలైంది... సైనికులు సిద్ధంగా ఉన్నారు... యుద్ధం ఏకపక్షమే.. హత్యా రాజకీయాలు మనకొద్దు.. రాష్ట్ర అభివృద్ధి మనకు ముద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం పట్టణంలోని అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మీ ఇంటి పెద్ద కొడుకుగా, అన్నగా మీకు ఎంతో సేవ చేశానని, మీరే నన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పసుపు కుంకుమ, పింఛన్లు, అన్నదాత సుఖీభవ, చంద్రన్న బీమా, పెళ్లికానుక ఇలా.. ఒక్కో ఇంటికి ఐదారుగురికి లబ్ధి చేకూరిందని, లబ్ధిదారులే ప్రచార సాధకులుగా మారాలన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు జరిగాయని, మరో 18 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యతను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మనతోనే ఉన్నారని, వారిని చైతన్యవంతులను చేసి అవతలి పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి నేను పడిన కష్టానికి కూలి అడుగుతున్నా.. టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఉందా? లేదా తమ్ముళ్లూ మీరే చెప్పండి అంటూ వారితో చెప్పించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో లాలూచీపడి రాజకీయాలు నెరుపుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వీరికి కేంద్రంలో ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయన్నారు. టీడీపీని అధికారం నుంచి దించేందుకు మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంలో జగన్ ద్వారా సాధించేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇక్కడ వైసీపీ ఫ్యాన్ తిరిగేందుకు ప్రధాని మోదీ కరెంట్, కేసీఆర్ స్విచ్ మాదిరి పనిచేస్తున్నారని చమత్కరించారు. విభజన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోదీ, విభజన చట్టం మేరకు ఏపీకి రావాల్సిన నిధులు, హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతియేటా వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాలను సద్వినియోగం చేసుకునేందుకు పోలవరం ప్రాజెక్టు చేపడితే కేసీఆర్ న్యాయస్థానాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని, దీనికి జగన్ సహకరిస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మిషన్-150 ప్లస్ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎన్నికల్లో సమర్ధులకే టిక్కెట్లను కట్టబెట్టామని, వైసీపీ మాదిరిగా బిడ్డింగ్ నిర్వహించలేదని ఎద్దేవా చేశారు. రాజకీయాలను వేలం ద్వారా వసూలుచేసే పరిస్ధితి వైసీపీదని విమర్శించారు. ఎవరు పార్టీని దెబ్బతీయాలన్నా వారే దెబ్బతింటారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు వస్తున్నారు జాగ్రత్త తమ్ముళ్లు అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో 65 లక్షల మంది సైన్యం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు.
చిత్రం..విశాఖపట్నంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వేదికపై టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, నేతలు