రాష్ట్రీయం

మాది నెంబర్ వన్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సామాజిక సమతుల్యతలో భాగంగానే అందరికీ టిక్కెట్లు ఇవ్వలేకపోయామని, అయితే ఇప్పటివరకు నెంబర్ వన్ టీంను ఎంపిక చేశామని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎలక్షన్ మిషన్ - 2019పై పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ధర్మయుద్ధంలో అంతిమంగా తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రెండు విడతలుగా ఇప్పటివరకు 151 మంది అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కంటే తాము ముందున్నట్లు తెలిపారు. మిగిలిన అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీట్లకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఏడుకొండల వాడి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించామని, ప్రతిచోట కార్యకర్తల్లో నూతనోత్తేజం రావటం శుభ సూచకమన్నారు. ‘ఉత్సాహంతో కదం తొక్కండి.. ఉద్ధృతంగా ప్రచారం చేయండి’ అని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫారం - 6, 7 దరఖాస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు పనిచేసిన వాళ్లంతా ఏపీకి వస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్, వైసీపీ కుమ్మక్కయి ఫారం - 6ను కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు. పదిరెట్లు పింఛన్ పొందుతున్న వారంతా ప్రచార సారథులేనన్నారు. ప్రజల్లో పరపతి లేని వాళ్లే టీడీపీని వీడుతున్నారని, స్వలాభం కోసం పార్టీలోకి వచ్చి బయటకు వెళుతున్నారని విమర్శించారు. నిజాయతీపరులంతా టీడీపీలోనే ఉన్నారన్నారు. స్వార్థపరులే టిక్కెట్లు దక్కలేదని టీడీపీ వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు సమర్థ బృందాన్ని ఎంపిక చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే అందరికంటే నెంబర్ వన్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. చిన్నాన్న హత్య కేసును కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కేసులో వాస్తవాలను సిట్ దర్యాప్తు బృందం వెలికితీస్తోందని చెప్పారు. వైసీపీకి ఓటేస్తే ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదన్నారు రాజకీయ లాభాల కోసం హత్యలు, దోపిడీలు చేస్తారని, ఎన్నికల్లో లబ్ధి కోసం ఎలాంటి దురాగతానికైనా వైసీపీ బరితెగిస్తుందని హెచ్చరించారు. ఆ పార్టీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్‌ఎస్ గంపలోకే చేరతారని విమర్శించారు. ఏపీకి నీళ్లు రాకుండా చేయటమే టీఆర్‌ఎస్ దురాలోచన అని, అందుకే పదేపదే పోలవరంపై పిటిషన్లు, కోర్టు కేసులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే కేసీఆర్ ఆటలు సాగవనే భయంతోనే కుట్రలకు పాల్పడుతున్నారని, జగన్, కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధిచెప్పాలని కోరారు.