రాష్ట్రీయం

నేనే డ్రైవర్ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/విజయనగరం: ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సురక్షితంగా చూసుకుంటున్న నేను నెంబర్ వన్ డ్రైవర్నంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తానే కితాబు ఇచ్చుకున్నారు. విశాఖలో ఆదివారం జరిగిన కార్యకర్తలు, సేవామిత్రల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని గత ఐదేళ్లలో తన స్వయం కృషితో అభివృద్ధి బాట పట్టిస్తున్నానన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా టీడీపీకి 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉందని, అలెగ్జాండర్ వంటి ప్రపంచ విజేత విజయాల వెనుక సైన్యం సంకల్పం ఉందన్నారు. అలాంటి అలెగ్జాండర్‌లు తన వెనుక 60 లక్షల మంది ఉన్నారన్నారు. దీనికి తోడు 90 లక్షల మంది అక్కాచెల్లెళ్ల బలం అండగా లభించిందన్నారు. కోటిన్నర సైన్యం తన మంచి కోరుతుంటే ఇక ఏ పార్టీ మాత్రం తమకు పోటీగా వస్తుందన్నారు. ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు మరే రాజకీయ పార్టీకి లేదన్నారు. నేర చరిత ఉన్న నేతలకు ఓట్లేస్తే వీధికో గూండా, గల్లీకో రౌడీ అధికారం చెలాయించి, ప్రజలను దోచుకుంటారన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుతున్న టీడీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు, 150 అసెంబ్లీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో ప్రధానిని మనమే నిర్ణయించి, మనకు కావాల్సినవి సాధించుకుంటామన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పిలుపిస్తేనే 82 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించిన అక్కడి ప్రజలు, తాను పిలుపిస్తే ఇంకెంత మెజార్టీతో గెలిపిస్తారో నేను ఊహించగలనన్నారు. అమరావతి, తిరుపతి, విశాఖ నగరాలను వరల్డ్‌క్లాస్ సిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో టీడీపీని గెలిపించడం ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తును కేడర్‌కు వివరించారు. దాదాపు 12 రోజుల పాటు పద్ధతి ప్రకారం నియోజకవర్గాల వారీగా అందరినీ పిలిపించి సమీక్ష చేసిన తరువాతే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు.
వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైతే వాస్తవాలను దాచిపెట్టారని, దానిని కుటుంబ సభ్యులు ఆత్మహత్యగా చెప్పడం దారుణమని చంద్రబాబు అన్నారు.

చిత్రం.. విశాఖలో చంద్రబాబుకు జ్ఞాపికను బహూకరిస్తున్న కార్యకర్తలు