రాష్ట్రీయం

బీఎస్పీకి 3 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: పొత్తుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో బహుజన సమాజ్ పార్టీకి మూడు లోక్‌సభ, 21 శాసనసభ స్థానాలను కేటాయించినట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, బాపట్ల పార్లమెంట్ స్థానాలను బీఎస్పీకి కేటాయించినట్లు తెలిపారు. ఆదివారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు వీర్‌సింగ్, ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ బీఎస్పీకి మూడు లోక్‌సభ, 21 శాసనసభ స్థానాలు కేటాయించామని, బీఎస్పీతో కలిసి ప్రయాణం చేయడం వ్యక్తిగతంగా చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. గతంలో తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీఎస్పీ అధ్యక్షునిగా పనిచేయమని అడిగారని, అయితే ఆనాటి రాజకీయ ప్రస్థానం వల్ల అది ముందుకి వెళ్లలేదని, ఇప్పుడు పొత్తుల కారణంగా కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. సోదరి మాయావతి లాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేతను దేశానికి ప్రధానిగా చూడాలన్నది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అన్నారు. రాజకీయాలు ప్రజలను భయపెట్టేలా కాకుండా అందరినీ కలిపేలా ఉండాలన్న లక్ష్యంతో చాలా చక్కటి వాతావరణంలో చర్చలు సాగాయన్నారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రముఖ ఎకనమిస్ట్ డాక్టర్ పెంటిపాటి పుల్లారావును ఎంపిక చేసినట్లు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఈసందర్భంగా వీర్‌సింగ్ మాట్లాడుతూ జనసేనతో పొత్తు కుదిరిన మార్చి 15వ తేదీ ఒక శుభదినమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం మాయావతి పాటుపడుతున్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అదేవిధమైన సామాజిక మార్పు దిశగా పవన్‌కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. ఏప్రిల్ 3, 4తేదీల్లో అమలాపురం, తిరుపతి, హైదరాబాద్‌లలో జరిగే సభల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పాల్గొననున్నట్లు తెలిపారు. సమావేశంలో జనసేన ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఆర్‌జే మల్లిక్, చిట్టిబాబు పాల్గొన్నారు.
జనసేనలోకి లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీ లక్ష్మీనారాయణ ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరితోపాటు ఆయన తోడల్లుడు, విద్యావేత్త, శ్రీకృష్ణ దేవరాయ వర్శిటీ మాజీ ఉప కులపతి రాజగోపాల్ కూడా జనసేనలో చేశారు. జనసేన మూల సిద్ధాంతాలు, పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ నిబద్ధతకు ఆకర్షితులైన కడప జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం నేతలు జనసేనలో చేశారు. బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడు సయ్యద్ ముకరం చాంద్, రాయచోటికి చెందిన ఎస్‌కే హసన్ బాషా ఆదివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జనసేనలో చేశారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చాంద్, బాషాలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కడప జిల్లా జనసేన నాయకులు నార్జల దాశరథి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్రం..జేడీ లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానిస్తున్న పవన్‌కళ్యాణ్