రాష్ట్రీయం

యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పదవ రోజు ఆదివారం మహాపూర్ణాహుతి, సుదర్శన చక్రతీర్థం, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు అర్చక, యాజ్ఞిక బృందం శాస్తయ్రుక్తంగా ఘనంగా నిర్వహించింది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు గరుడుడి ఆహ్వానంతో యాదాద్రికి విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతు వారిని తృప్తి పరిచేలా వసోర్ధార మొదలగు మంత్ర పఠనాలతో, లోకాల్లో సువృష్టిని కురిపించాలని వేడుకుంటు భక్తియుతంగా ఉదయం 11గంటలకు బాల ఆలయంలో పూర్ణాహుతి నిర్వహించారు. యాజ్ఞీకులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యుల వేదపండిత బృందం మహాపూర్ణాహుతిని శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. అనంతరం జగత్ రక్షక్షుడైన శ్రీమహావిష్ణువు ప్రధాన ఆయుధం మహా సుదర్శన చక్ర ఆళ్వార్‌కు బాల ఆలయంలో చక్రతీర్ధస్నానం నిర్వహించారు. చక్రతీర్ధ స్నాన పుణ్యజలాలను భక్తులపై చల్లి అర్చక పండితులు సంప్రోక్షణ చేశారు. యాదాద్రి భక్తుల రక్షణకు లక్ష్మీనరసింహుడు శ్రీ సుదర్శనుడిని నియమించినట్లుగా స్థల పురాణం చాటుతుంది.
శ్రీ చక్రతీర్ధ స్నాన ఘట్టం పిదప రాత్రి శ్రీలక్ష్మీనరసింహులను దశావతార స్త్రోతాలతో స్తుతిస్తు ఇష్టమైన పూలతో శ్రీ పుష్పయాగం నిర్వహించారు. అనంతరం దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహామూర్తిలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సోమవారం పదకొండవ రోజున శ్రీ స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోల్సోత్సవాలతో ఉత్సవాల పరిసమాప్తి జరుగనుంది.

చిత్రం.. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాల ఆలయంలో శ్రీ చక్ర తీర్ధ స్నానం దృశ్యం