రాష్ట్రీయం

స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్: పార్టీ కోసం కష్టపడే వారికి అందాల్సిన ఫలాలు ప్రతిపక్షాల వారికి అందుతున్నాయి.. నాయకులు వారి స్వార్థం కోసం కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు.. అందువల్లనే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తెరాసకు ఓట్లు తక్కువగా వచ్చాయా? అంటే.. ఇది అక్షర సత్యమని బూత్ కమిటీ నాయకుల సమావేశంలో వెల్లడైంది. రెండు రోజుల క్రితం బోధన్‌లో ఎంపీ కవిత నియోజకవర్గానికి సంబంధించి బూత్ కమిటీ నాయకులతో టాప్ సీక్రెట్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బోధన్ మండల సమావేశంలో అనేక వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ మండలంలో ఒకరిద్దరు నాయకులు తమ స్వార్థం కోసం గత ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆ పార్టీకి చెందిన నాయకుల బంధువులకు పెద్ద పీట వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలలో అసలు లబ్దిదారులకు బదులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారికి ఎక్కువ లబ్ది చేకూర్చారు. ఈ విషయమై తెరాస కార్యకర్తలు ఈబాగోతాలన్ని కళ్లారా చూసినా పార్టీలో నెలకొన్న పరిస్థితుల వలన ఎవ్వరికి చెప్పుకోలేక స్తబ్దంగా ఉంటూ వచ్చారు. ఈ ప్రభావం ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. మండలంలో మొత్తం 42 గ్రామాలకు గాను కేవలం 17 గ్రామాలలో మాత్రమే తెరాసకు భారీ మెజార్టీ వచ్చింది.
గులాబీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామాలలో కూడా తెరాసకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేక పోయాయి. దీనికి గల కారణాలను రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఎంపీ ఆరా తీయగా నాయకుల స్వార్థ రాజకీయాలు ఒక్కసారిగా బయట పడ్డాయి. ఈసమావేశంలో పాల్గొన్న గ్రామస్థాయి బూత్ కమిటీ నాయకులు గ్రామాల వారీగా తమ కార్యకర్తలకు జరిగిన అన్యాయం గురించి బయట పెట్టారు. బోధన్ మండలానికి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లను మంజూరు చేశారు. కానీ ఈ ట్రాక్టర్లు అందుకున్న వారంతా ఎక్కడున్నారని ఏకంగా గ్రామస్థాయి నాయకులు ఎంపీకి ప్రశ్నించడంతో ఎంపీ సైతం నివ్వెర పోయినట్లు తెలిసింది. ఈ విషయమై ఎంపీ వెంటనే స్థానిక శాసనసభ్యుడిని ప్రశ్నించగా ట్రాక్టర్ల విషయంలో తాను కల్పించుకోలేదని సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఇందులో బోధన్ మండలానికి చెందిన ఓ నాయకుడు తనకు అనుకూలంగా ఉంటూ ఇతర పార్టీలలో కొనసాగుతున్న వారికి ట్రాక్టర్లు వచ్చేలా కృషి చేసినట్లు ఈ సమీక్షలో వెల్లడవ్వడంతో ఎంపీ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. ఇక నుండి ఇలా జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఎంపీ బూత్ స్థాయి నాయకులకు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర పార్టీల వారికి న్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని మంజీరా పరివాహక గ్రామాల నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. బోధన్ మండలంలోని కొన్ని గ్రామాలలో మొన్నటి వరకు తెరాసకు పూర్తిగా వ్యితిరేకంగా పనిచేసిన వారు, ప్రస్తుతం సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు నేడు తెరాసలో చేరుతున్నారని ఈ పరిస్థితులు తమను ఇబ్బందులకు గురయ్యే విధంగా ఉన్నాయని కొందరు ముఖ్య నేతలు ఎంపీకి వివరించారు. ఇప్పటి నుండి నాయకులంతా స్వార్థాన్ని ప్రక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని ఎంపీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
అంతేకాకుండా మేము చాలా అమాయకులం కదా అందుకే ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎవరెవరు ఏ విధంగా పనిచేసారో నివేదికలన్నీ మా దగ్గర ఉన్నాయంటూ నాయకులకు పరోక్షంగా చురకలంటిస్తూ అన్నింటా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత నివ్వాలని సూచించినట్లు భోగట్టా. ఏది ఏమైనా బోధన్ మండలం పై జరిగిన సమీక్షా సమావేశంలో ఒకరిద్దరు నాయకుల వ్యవహారం బయట పడటం, అసలు వాస్తవాలు ఎంపీ దృష్టికి వెళ్లడంతో గ్రామస్థాయి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు నాయకులు తమ స్వార్థం కోసం పార్టీ కార్యకర్తలను విస్మరించి ఇతర పార్టీల వారికి పెద్ద పీట వేశారన్న వాస్తవం ఎంపీ దృష్టికి వెళ్లడంతో మునుముందు ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థాయి నాయకులు సంబర పడుతున్నారు.