రాష్ట్రీయం

మెదక్‌లో ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 17: ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించినా గడచిన రెండు దశాబ్దాల్లో ప్రాభవాన్ని కోల్పోతోంది. మెదక్ పార్లమెంటు స్థానం నుండి ప్రాతినిథ్యం వహించి దేశానికే ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఇందిరాగాంధీకి సైతం ఈ నియోజకవర్గం అండగా నిలిచింది. 1952లో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గంలో బోణీ కొట్టలేకపోగా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్) తొలి విజయాన్ని నమోదు చేసుకుని చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో వెనుకడుగు వేయలేదు. మధ్య మధ్యలో ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకున్నా తిరుగులేని ఆధిపత్యం మాత్రం కాంగ్రెస్‌దే. 1980 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ పోటీ చేయగా నియోజకవర్గ ప్రజలు 3 లక్షల పైచీలుకు ఓట్లను కట్టబెట్టి విజయాన్ని అందించారు. 1989 నుండి వరుసగా నాలుగుసార్లు ఎన్నికల్లో దివంగత నేత, పార్లమెంటు అవార్డు గ్రహీత బాగారెడ్డి తిరుగులేని విజయాలను స్వంతం చేసుకున్నారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16సార్లు సార్వత్రిక ఎన్నికలు కొనసాగగా, 2014 యేడాదిలో ఒకమారు ఉప ఎన్నిక అనివార్యమైంది. 17సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9సార్లు విజయపరంపర కొనసాగించి తిరుగులేదని నిరూపించుకుంది. టీడీపీ, బీజేపీ, తెలంగాణ ప్రజాసమితి, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్) ఒక్కోసారి జయకేతనం ఎగురవేసాయి. 2004, 2009, 2014 సంవత్సరాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్ వరుసగా గెలుపొందింది. 2014లో మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన గులాబి దళపతి కేసీఆర్ భారీ మెజార్టీతో విజయం సాధించగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2014 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,61,277 ఓట్ల మెజార్టీతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సునితా లక్ష్మారెడ్డిపై ఘనవిజయం సాధించారు. 2014 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ 3,97,029 ఓట్ల మెజార్టీ ఈ నియోజకవర్గంలో రికార్డుగా నమోదు చేసుకుంది. మల్లికార్జున్, ఆలె నరేంద్ర తదితరులు రెండేసి పర్యాయాలు విజయాలను నమోదు చేసుకోగా ఒక్క బాగారెడ్డి మాత్రం నాలుగు సార్లు జయకేతనం ఎగురవేసి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో చెరగనిముద్ర వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఊహించిన ఫలితాలను సాధించుకున్నట్లుగానే ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికలో మెదక్ నుండి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పావులు కదుపుతోంది. సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన హేమాహేమీలు సైతం జంకుతుండటం, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దీనస్థితికి అద్దం పడుతోంది. ప్రధాన నాయకులు ఎవరు కూడా టికెట్ కోసం ప్రయత్నించకపోవడమే ఇందుకు నిదర్శనం. మొత్తంమీద కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు స్థానంలో తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.