రాష్ట్రీయం

కేసీఆర్ పిలుపిస్తేనే 82 వస్తే.. నేనిస్తే ఇంకెంత మెజారిటీయో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 17: తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పిలుపునిస్తేనే 82 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించిన అక్కడి ప్రజలు, తాను ఇక్కడ పిలుపునిస్తే ప్రజలు ఇంకెంత మెజార్టీతో గెలిపిస్తారో నేను ఊహించగలనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు అన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన కార్యకర్తలు, సేవామిత్రల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కేసీఆర్‌తో కలిసి జగన్ లాలూచీ రాజకీయాలు నెరుపుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వీరికి కేంద్రంలో ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయన్నారు. టీడీపీని అధికారం నుంచి దించేందుకు మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంలో జగన్ ద్వారా సాధించేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇక్కడ వైసీపీ ఫ్యాన్ తిరిగేందుకు ప్రధాని మోదీ కరెంట్, కేసీఆర్ స్విచ్ మాదిరి పనిచేస్తున్నారని విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోదీ, విభజన చట్టం మేరకు ఏపీకి రావాల్సిన నిధులు, హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతియేటా వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాలను సద్వినియోగం చేసుకునేందుకు పోలవరం ప్రాజెక్టు చేపడితే కేసీఆర్ న్యాయస్థానాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని, దీనికి జగన్ సహకరిస్తున్నారన్నారని ఆరోపించారు.