రాష్ట్రీయం

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 17 మంది రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ‘నోటీస్’ జారీ చేశారు. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యలో 21 న హోలీ పండగ, 23న ఆదివారం కారణంగా ఆ రెండు రోజులు సెలవులు కావడంతో నామినేషన్లు స్వీకరించడం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కాగా, ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ (ఎస్‌టీ) లో కాంగ్రెస్ అభ్యర్థిగా రమేష్ రాథోడ్, పెద్దపల్లి (ఎస్‌సీ) లో బీజేపీ అభ్యర్థిగా కొయ్యాడ స్వామి, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా తాడెం రాజ్ ప్రకాశ్ నామినేషన్లు వేశారు. కరీంనగర్ నుండి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా చింతా అనిల్ కుమార్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్, వరంగల్ (ఎస్‌సీ)లో బీఎస్‌పీ అభ్యర్థిగా బరిగల్ల శివ నామినేషన్లు వేశారు. మిగతా 12 నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.
అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవై నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే అసదుద్దీన్ నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కన్నన్ మాణిక్ రాజ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ పార్టీకి చెందిన యకుత్‌పురా నియోజకవర్గం శాసన సభ్యుడు పాషా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కన్నన్ మాణిక్ రాజ్‌కు అందచేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ