రాష్ట్రీయం

కేసీఆర్‌కు డజను రిటర్న్ గిఫ్టులు ఇస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: కేసీఆర్ తనకు ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ మాట్లాడుతున్నారని, కానీ తాను ఆయనకు డజను గిఫ్ట్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. టీడీపీ కృష్ణా జిల్లా ఎన్నికల సన్నాహక సమావేశం విజయవాడలో సోమవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ తానేదో గొప్ప నాయకుడు అనుకుంటున్నారని, ఏపీతో పెట్టుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కేసీఆర్, మోదీ కుట్రలు పన్నుతున్నారన్నారు. పురాతన ఆలయాలు, హెవీ వాటర్ ప్లాంట్ ముంపునకు గురి అవుతుంటూ సుప్రీంకోర్టులో టీఆర్‌ఎస్ పిటిషన్ వేసిందని, ఈ నెల 20న కోర్టు తన నిర్ణయం తెలుపనుందన్నారు. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలవాలని, అప్పుడు మనమే ప్రధానిని నిర్ణయిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేశానని, వైకాపా మాదిరిగా డబ్బులకు సీట్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించకుండా నమ్మక ద్రోహం చేయలేదా అని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. తన వెనుక 65 లక్షల మంది కార్యకర్తలు, కోటి మంది మహిళలు, 5 లక్షల మంది నిరుద్యోగుల సైన్యం ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. మోదీ విద్యుత్ ఇచ్చి, కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే కానీ ఇక్కడి జనన్ ఫ్యాన్ తిరగదని ఎద్దేవా చేశారు. సొంత చిన్నాన్న హత్యనే రాజకీయాలకు వాడుకుంటే, సామాన్యులను ఏమి బతకనిస్తారన్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ఇటువంటి వారి పట్ల అప్రమ్తతంగా ఉండాలన్నారు. రోజుకు మూడు సార్లు ఓటు ఉందో లేదో చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈవీఎంలకు సంబంధించి వీవీపాట్‌లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుజాతి పౌరుషం చూపించి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని, మన రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఉంటుందో చూపించాలన్నారు. ఇక మెజారిటీకి సంబంధించి మచిలీపట్నం, విజయవాడ ఎంపీ సీట్ల మధ్య పోటీ, అసెంబ్లీ అభ్యర్థుల మధ్య, బూత్‌ల మధ్య, సేవా మిత్రల మధ్య పోటీ పెడతామన్నారు. అత్యధిక మెజారిటీలో అన్ని సీట్లను గెలిపించాలన్నారు.