రాష్ట్రీయం

అవకాశమిస్తే.. జగన్ మింగేస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌కు అవకాశమిస్తే రాష్ట్రంతో పాటు ప్రజలను కూడా మింగేస్తాడని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని నిస్సిగ్గుగా అడుగుతున్న జగన్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నేరాల్లో, హత్యల్లో అనుభవం చూసి ఆయనకు అవకాశమివ్వాలా అని నిలదీశారు. వైసీపీకి ఓటేస్తే హత్యా రాజకీయాలకు ఓటేసినట్టే అన్నారు. గతంలో 200 మంది టీడీపీ కార్యకర్తలను బలిగొన్నారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పెంచామని, పేదలకు లక్షల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టీడీపీ కార్యకర్తల్లో ఎన్నికల ఉత్సాహం రెట్టింపయిందన్నారు. గెలుపే లక్ష్యంగా సమష్టి కృషి జరపాలన్నారు. ప్రత్యర్థుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో మన పోటీ నేరగాళ్ల పార్టీతోనే అని, ఎన్నికల్లో సైబర్ నేరగాళ్ల అరాచకం పెరిగిందన్నారు. వాళ్లంతా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారని, నేరగాళ్లకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. మైండ్‌గేమ్‌లో మాత్రమే కాదు, సైకో గేమ్‌లో కూడా జగన్ దిట్ట అని వ్యాఖ్యానించారు. ప్రలోభపెట్టటం, బెదిరించటం, బ్లాక్‌మెయిల్ చేయటం ఆయన నైజమన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో బెదిరిస్తారని ప్రత్యర్థుల కుట్రలను చిత్తు చేయాలన్నారు. నామినేషన్లలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీవీ ప్యాట్లు, మెషీన్లపై అవగాహన పెంచుకోవాలని ఈవీఎంలపై ఓటర్లను చైతన్య పరచాలన్నారు. ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగం అంతా తేటతెల్లమైందని, ఓటర్ల నమోదులోనే అన్ని అక్రమాలు చేశారన్నారు. పోలింగ్‌లో వైసీపీ మరిన్ని అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. నామినేషన్ల తేదీ, ఉపసంహరణ, పోలింగ్ వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాల కుట్రలను భగ్నం చేయాలని నిర్దేశించారు. వివేకా హంతకులను వదిలిపెట్టే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. హత్య అని తెలిసి కూడా గుండెపోటు డ్రామాగా ఎందుకు చిత్రీకరించారో విచారణలో నిగ్గు తేలుస్తామన్నారు. డ్రైవర్‌కు ప్రాణహాని ఉందనే వారు ఎవరి నుంచి ఉందో తేల్చాలన్నారు. అటు, ఇటు నేరగాళ్లతో జగన్ అభ్యర్థులను ప్రకటించారన్నారు. ఒకవైపు నందిగం సురేష్, మరోవైపు ధర్మాన ప్రసాదరావు మధ్యలో 12 చార్జిషీట్లలో ఏ వన్ నిందితుడుగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. రాజధానిలో అరటితోటలు దగ్ధం చేసిన కేసులో సురేష్ నిందితుడని, కనె్నధార గ్రానైట్ కొండలు కొల్లగొట్టిన కేసులో ధర్మానకు నేర చరిత్ర ఉందని, నాడు కళంకిత మంత్రుల్లో ధర్మాన మొదటి వరుసలో ఉన్నారన్నారు. వాళ్లను అభ్యర్థులుగా ప్రకటించిన వైసీపీ నేరగాళ్ల పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతు కూడగట్టాలని పార్టీశ్రేణులను ఆదేశించారు. రైతు రుణమాఫీ, పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ వైద్యసేవ, పక్కా ఇళ్ల నిర్మాణంపై ఇంటింట ప్రచారం నిర్వహించాలన్నారు. అభివృద్ధికి కొనసాగింపుగా టీడీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు. విస్తృత ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని, కొందరికి సీట్లు ఇవ్వలేకపోయినా వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అందరి సేవలు పార్టీకి అవసరమన్నారు అత్యంత కీలకమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని చెప్తూ ఈ పరిస్థితుల్లో పార్టీకి అంతా అండగా నిలవాలన్నారు.