రాష్ట్రీయం

రెండేళ్లలో రంగారెడ్డి సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శంషాబాద్, మార్చి 19: ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం పూర్తి చేసి రెండు సంవత్సరాల్లో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయ్యడమే కేసీఆర్ లక్ష్యమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం శంషాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నికల సభలో మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్ రెడ్డి.. కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ మాట్లాడుతూ 111జీఓ కారణంగా ఎనభై ఆరు గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చెవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యను కేసీఆర్ పిలిచి 86గ్రామ సర్పంచులతో తీర్మానం చేయించి తన వద్దకు తీసుకువస్తే 111జీఓ ను పూర్తిగా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. త్వరలోనే ఎయిర్‌పోర్టులో, ఎయిర్ పోర్టుసిటీ, బుద్వేల్, కిస్‌మత్‌పూర్‌లో ఐటీ పార్కులను ప్రారంభిస్తామని దీంతో రంగారెడ్డి జిల్లాలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చేవెళ్ల గడ్డపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, తెలంగాణలోని టీఆర్‌ఎస్ 16, ఎంఐఎంని ఒక స్థానంలో గెలిపిస్తే దిల్లీలో చక్రం తిప్పే అవకాశం ఉంటుందని, టీఆర్‌ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి పీ.మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.

చిత్రం.. కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కార్తీక్‌రెడ్డి