రాష్ట్రీయం

బీజేపీలోకి డీకే అరుణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: కాంగ్రెస్ నాయకురాలు, మూడు మార్లు గద్వాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే అరుణ బీజేపీలో చేరిక ఖరారైంది. అయితే పార్టీ మార్పిడిని అరుణ నిర్ధారించలేదు. బీజేపీ నేతలు మాత్రం తమతో అరుణ టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అరుణ గద్వాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అరుణ నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ టిక్కెట్ ఇస్తే తాను పోటీ చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పినట్టు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో డిప్యుటీ సీఎం దామోదర్ రాజనర్సింహ సతీమణి బీజేపీలో చేరడం కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికే వెళ్లడంతో బీజేపీ నేతలు అరుణ పార్టీ మార్పిడిపై గుంభనంగా ఉన్నారు. బీజేపీ ప్రధానకార్యదర్శి రాం మాధవ్ అరుణ ఇంటికి వెళ్లి చర్చించారని, 45 నిమిషాలకు పైగా మాధవ్ చర్చించారని తెలిసింది. డీకే అరుణ భవిష్యత్‌పై రాం మాధవ్ పూర్తి భరోసా ఇవ్వడంతో అరుణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకత్వంతోనూ చర్చలు జరిపారని తెలిసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాల్సిందిగా పార్టీ బీజేపీ నేతలు కోరినట్టు సమాచారం. దీనికి అరుణ సుముఖత వ్యక్తం చేయడంతో అధికారికంగా ఈ వ్యవహారాన్ని బుధవారం నాడు ప్రకటించనున్నట్టు తెలిసింది.