రాష్ట్రీయం

ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (ఐఎన్‌టియుసి) అధ్యక్షునిగా డాక్టర్ జి సంజీవరెడ్డి ఏకగ్రీవంగా మళ్లీ ఎన్నికయ్యారు. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో శని-ఆదివారం రెండు రోజుల పాటు జరిగిన 92వ జనరల్ కౌన్సిల్‌లో సభ్యులు సంజీవరెడ్డినే తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐఎన్‌టీయూసీ అధ్యక్షునిగా సంజీవరెడ్డి ఎన్నిక కావడం ఇది ఆరవసారి. ఐఎన్‌టియుసి అత్యధికంగా 3,33,5,677 మంది సభ్యత్వం కలిగి ఉండటంతో ప్రపంచంలోనే పెద్ద ట్రేడ్ యూనియన్‌గా గుర్తింపు పొందింది. ఐఎన్‌టియుసి అధ్యక్షునిగా ఎన్నికైన సంజీవరెడ్డి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. జార్కండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర సింగ్‌ను ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా ఆర్‌సి కుంతియా, ఎం రాఘవయ్య, ఆర్ చంద్రశేఖరన్, అశోక్‌సింగ్, సంజయ్‌సింగ్, కేకే నాయర్‌ను కోశాధికారిగా నియమించినట్టు ప్రకటించారు. వీరితో పాటు ఎనిమిది మందిని కార్యదర్శులుగా నియమించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.