రాష్ట్రీయం

జాతీయ న్యాయవిద్య ప్రవేశపరీక్ష వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: జాతీయ న్యాయవిద్య విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘క్లాట్-2019’ను వాయిదా వేస్తున్నట్టు క్లాట్ కాన్సార్టియం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్లాట్ కాన్సార్టియం పేర్కొంది.
మే 12వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో క్లాట్ -2019ను మే 26వ తేదీకి మార్చినట్టు క్లాట్ కన్వీనర్, ఒడిస్సా నేషనల్ లా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణదేవరావు చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకూ గడువు ఉందని ఆయన వెల్లడించారు. వాస్తవానికి మే 12న పియర్సన్ సంస్థ నిర్వహించే ఎల్ శాట్ ఇండియా ప్రవేశపరీక్ష కూడా ఉంది, ఒకే రోజు రెండు పరీక్షలు ఎలా రాయాలా అని విద్యార్థులు అంతా గందరగోళంలో పడిన సందర్భంగా క్లాట్ కాన్సార్టియం నిర్ణయం అందరికీ ఊరటనిచ్చింది. పరీక్ష మే 26న సాయంత్రం 3 గంటల నుండి ఐదు గంటల వరకూ జరుగుతుందని కన్వీనర్ పేర్కొన్నారు.
మోడల్ స్కూల్ పరీక్ష తేదీల్లో మార్పు
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టును ఏప్రిల్ 18వ తేదీన నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ పరీక్షను ఏప్రిల్ 13న నిర్వహించాలని తొలుత భావించారు. కాని లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష తేదీని మార్చాల్సి వచ్చింది.
గ్రూప్-4 ఫలితాలను ప్రకటించిన సర్వీసు కమిషన్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-4 ఫలితాలను ప్రకటించింది. మెరిట్ జాబితాను సర్వీసు కమిషన్ తన పోర్టల్‌లో ఉంచింది. మొత్తం పరీక్షకు 2,72,132 మంది హాజరుకాగా, తెలంగాణ ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు క్వాలిఫై అయిన 33,132 మందితో జాబితాను పొందుపరిచారు. వారిలో రోస్టర్, ఖాళీల ప్రాతిపదికగా తుది జాబితాను రూపొందిస్తారు. అలగే గ్రేటర్ హైదరాబాద్ బిల్ కలెక్టర్ పోస్టులకు 68,378 మందితో మెరిట్ జాబితా రూపొందించారు. తెలంగాణ స్టేట్ బెవరేజేస్ కార్పొరేషన్‌లో పోస్టులకు 19545 మందితోనూ మెరిట్ లిస్టులు రూపొందించారు. అయితే వీరిలో ఖాళీల ప్రాతిపదికగా మాత్రమే తుది ఎంపిక జరుగుతుంది. మహాత్మా జ్యోతి పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ పోస్టుల ఎంపిక నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు సర్వీసు కమిషన్ పేర్కొంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష వాయిదా
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సైతం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం పరీక్షను మే 19న నిర్వహించాల్సి ఉండగా, దానిని మే 27న నిర్వహించనున్నట్టు ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది. మే 27న ఉదయం 9 నుండి 12 వరకూ ఫస్టు పేపర్, మధ్యాహ్నం 2 నుండి ఐదు వరకూ సెకండ్ పేపర్ నిర్వహిస్తారు.
ఆరుగురు అధికారులపై వేటు
పదో తరగతి పరీక్షల్లో అక్రమాలను అడ్డుకోలేకపోయిన ఆరుగురు అధికారులపై వేటు వేసినట్టు పరీక్షల బోర్డు డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు. ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్టుమెంటల్ అధికారులను విధుల నుండి రిలీవ్ చేశామని అన్నారు. కాగా మంగళవారం నాటి పరీక్షల్లో కాపీయింగ్‌కు ప్రయత్నించిన ముగ్గురు అభ్యర్ధులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేశామని చెప్పారు.