రాష్ట్రీయం

నిష్పక్షపాత విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల: ‘నాన్నకు ప్రజల తర్వాతే కుటుంబమని, ఆయన మరణవార్త తనను ఎంతగానో కుంగదీసిందని వైఎస్.వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అన్నారు. ఆయన మరణంపై నిప్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలో బుధవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పులివెందుల ప్రజల కోసం తన తండ్రి ప్రతినిత్యం ఆలోచించేవారన్నారు. పులివెందులలో ఏవైనా కార్యక్రమాలు ఉంటే వాటి తర్వాతే కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యేవారన్నారు. నాన్న తనను ప్రేమతో చూసుకునేవారన్నారు. గత కొద్దిరోజులుగా అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తనవద్దే హైదరాబాద్‌లో ఉంటోందన్నారు. దీంతో నాన్న ఒంటరిగా పులివెందులలో ఉండేవారన్నారు. నాన్నను సన్నిహితులు బాగా చూసుకునేవారన్నారు. మరణం తరువాత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారని, అయితే ఆయన చనిపోయారన్న బాధతో ఎవరూ సంఘటన ఎలా జరిగిందో ఆలోచించలేదన్నారు. ఆయన మరణంపై మీడియాలో చూపిస్తున్న విధానం చాలాబాధగా అనిపించిందన్నారు. కుటుంబ కలహాలు ఉన్నాయనడం భావ్యం కాదన్నారు. అందరి కుటుంబాల్లో చిన్నచిన్న గొడవలు సహజమని, తమది 700 మంది ఉన్న పెద్ద కుటుంబమన్నారు. ఒకరి పట్ల మరొకరు గౌరవ మర్యాదలు చూపించుకుంటామే తప్ప గొడవ పడమన్నారు. నాన్న మరణంపై పోలీసు విచారణ నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా జరగాలన్నారు. లేఖ ఎవరు రాశారన్నది ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడవుతుందన్నారు. హత్య ఎవరు చేశారో తెలిసేంతవరకు కథనాలు వెల్లడించడం మంచిది కాదన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నదే నాన్న కోరిక అని తెలిపారు. ఈ సమావేశంలో వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. పులివెందులలో విలేఖరులతో మాట్లాడుతున్న వివేకా కుమార్తె సునీతారెడ్డి