రాష్ట్రీయం

రేపే పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈ నెల 22వ తేదీ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ప్రశాంతంగా ముగిసింది. 22వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. కౌంటింగ్ ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, టెంపరరీ స్ట్రాంగ్‌రూమ్స్ ఏర్పాటయ్యాయి. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గంలో 2 లక్షల 48వేల మంది ఓటర్లు ఉండగా 362 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 104 మండల కేంద్రాలున్నాయి. ఈ రెండు జిల్లాలోని బ్యాలెట్ బాక్స్‌లను గుంటూరులోని ఏసీ కళాశాలలో ఏర్పాటైన ఓట్ల లెక్కింపు కేంద్రానికి పోలింగ్ ముగిసిన వెంటనే తరలించి 26వ తేదీ లెక్కిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గంలో 2 లక్షల 93వేల మంది ఓటర్లు ఉండగా 339 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15వేల 593 మంది ఓటర్లు ఉండగా 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.