రాష్ట్రీయం

హైటెక్ సిటీకి మెట్రో పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ (ఖైరతాబాద్): నగరవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అమీర్‌పేట్ - హైటెక్ సిటీ మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. బుధవారం ఉదయం 9:30 గంటలకు అమీర్‌పేట ఇంటర్‌చేంజ్ స్టేషన్ నుంచి గవర్నర్ నర్సింహన్ లాంఛనంగా ప్రారంభించారు. అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రోరైల్లో అధికారులతో కలిసి ప్రయాణించారు. హైటెక్ సిటీ స్టేషన్ వద్ద డీజీపీ మహేందర్ రెడ్డి, సీటీ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ, సైబరాబాద్ సీపీ స్వాగతం పలికారు. హైటెక్‌సిటీ స్టేషన్‌లో కొంత సేపుగడిపి క్షుణ్ణంగా పరిశీలించారు. మళ్లీ అదే రైలులో అమీర్‌పేట స్టేషన్‌కు చేరుకున్నారు. మార్గం మధ్యలో హైటెక్ రూట్‌లోని స్టేషన్ల వివరాలు, ప్రయాణికులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యాలపై ఆరా తీశారు. ఐటీ, బీపీఓ సంస్థలకు నిలయంగా ఉన్న హైటెక్ సిటీ ప్రాంతానికి నిత్యం నగరం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రయాణం సాగిస్తుంటారు. దీంతో ఆయా రూట్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతుంటాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంటుంది. అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీకి కేవలం పది కిలోమీటర్లే అయినా రోడ్డు మార్గంలో చేరుకునేందుకు గంటకుపైగా ప్రయాణించాల్సి వస్తుంది. ప్రస్తుతం మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం 45 నిమిషాల మేర తగ్గనుంది. ఎలాంటి కుదుపులు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడంతో ఆయా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకి ఎంతోగానో ఉపశమనం ఇవ్వనుంది. రెండు ప్రాంతాల మధ్య ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. అమీర్‌పేట నుంచి ప్రారంభమయి మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటుంది. వివిధ సాంకేతిక కారణాలతో జుబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లలో రైలు నిలపడం లేదని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయమే మెట్రో సర్వీసు ప్రారంభమైనా సాయంత్రం 4 గంటల నుంచి సాధారణ ప్రయాణికులను అనుమతి ఇచ్చారు. నిత్యం లక్షలది వాహనాలు సంచరించే రూట్‌లో మొదట్లో రోజు లక్ష మంది వరకు ప్రయాణించే అవకాశం ఉందని, త్వరలోనే ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి పది నిమిషాలకో ట్రైన్ సర్వీస్ ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.
తరుణి స్టేషన్‌గా మధురానగర్
మధురానగర్ స్టేషన్‌ను తరుణి స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. స్టేషన్‌ను పూర్తిగా మహిళలే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మహి ళా ఉత్పత్తిదారులు రూపొందించిన వస్తువులను అందుబాటులో ఉంచనున్నారు. సుమారు 150 స్టాళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

చిత్రం.. అమీర్‌పేట స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ నరసింహన్