రాష్ట్రీయం

ఆస్తులు: రూ.52 కోట్లు అప్పులు: 32 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీకి నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్‌తో పాటు ఆస్తులను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్థిర, చరాస్తుల విలువ రూ.52 కోట్లు ఉండగా, అప్పులు రూ.32 కోట్లుగా చూపారు. పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా, సంతానం అకీరా, ఆద్య, పొలినా, మార్క్ శంకర్‌ల పేరిట డిపాజిట్లు, ఇతర ఆస్తులు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వద్ద చేతిలో నగదు నిల్వ రూ.4,76,436 కాగా, ఆయన భార్య అన్నా వద్ద రూ.1.53,500గా చూపారు. పవన్ పేరిట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3,10,18,731, ఐసీఐసీఐలో సేవింగ్స్ ఖాతాలో రూ.1,30,50,093, హెచ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్ ఖాతాలో రూ.27,064, సీటీ బ్యాంకులో రూ.89,20,828, ఇండస్ బ్యాంకులో రూ.43,828 ఉన్నాయి. భార్య అన్నా పేరిట ఐసీఐసీఐలో రూ.13,872, హెచ్‌డీఎఫ్‌సీలో 46,845, హెచ్‌డీఎఫ్‌సీలో ఎఫ్‌డీ రూ.6,90,671, రష్యన్ బ్యాంకు ఆర్‌ఎఐఎఫ్‌లో రూ.3,51,117, మరో ఖాతాలో రూ.8,42,107 ఉన్నాయి. పవన్ సంతానం కే అకీరా పేరిట రూ.1,36,36,476, ఆద్య పేరిట రూ.1,00.80,636, పోలినా పేరిట రూ.29,58,966, మార్క్ శంకర్ పేరిట రూ.2,52,510 ఉన్నాయి. అలాగే పవన్ వద్ద 312 గ్రా. బంగారు, వజ్రాభరణాల విలువ రూ.27.08 లక్షలు, భార్య అన్నా పేరిట 215 గ్రా. బంగారు, వజ్రాభరణాలు విలువ రూ.9.52 లక్షలుగా చూపారు. పవన్ పేరిట మెర్సిడెస్ బెంజ్ రూ.72,92,264, టయోటా ఫార్చ్యున్ రూ.27.5 లక్షలు, స్కోడా రేపిడ్ రూ.27.67 లక్షలు, మహేంద్ర స్కార్పియో రూ.13.82 లక్షలు, వోల్వో కారు రూ.1.07 కోట్లు, హార్లీ డేవిడ్‌సన్ మోటారు సైకిల్ రూ.32.66 లక్షలు ఉన్నాయి. ఇక స్థిరాస్తులు- వ్యవసాయ భూములు 4 ఎకరాలు రూ.4,02,500, మరో వ్యవసాయ భూమి 4.02 ఎకరాలు విలువ రూ.4,24,615, మరో స్థిరాస్తి 10 ఎకరాలు విలువ రూ.2.76 కోట్లుగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో 1458, 753, 600 చదరపు గజాల నివాస స్థలాలు ఉన్నాయి. మంగళగిరిలో 0.9 ఎకరాల స్థలం, 2.07 ఎకరాల స్థలంతో పాటు శేరిలింగంపల్లిలో 1050 చదరపు గజాల నివాస స్థలం ఉన్నాయి. ఇక బ్యాంకులు, వ్యక్తులు, సినీ నిర్మాణ సంస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.32 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.