రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌లోకి ‘క్యూ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్ర సమతిలోకి వివిధ పార్టీల నాయకులు క్యూ కడుతున్నారు. తాజాగా, ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న నామా నాగేశ్వర్‌రావు గురువారం ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లో సీఎం కేసీఆర్ స్వగృహంలో నామాకు గులాబి కండువ కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. నామాతో పాటు పలువురు టీడీపీ జిల్లా బాధ్యులు కూడా మూక్కుమ్మడిగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమర్‌నాథ్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లూరి రామాదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి అనూషారామ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు జానపాటి శరత్‌బాబు, బిసి సెల్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మాధవరావు, ఖమ్మం నగర పార్టీ కన్వీనర్ సింహాద్రి యాదవ్, తెలుగు యువత అధ్యక్షుడు గొల్లపూడి హరికృష్ణ ఉన్నారు. ఇలా ఉండగా శాసనసభ ఎన్నికల్లో షాద్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రతాప్‌రెడ్డి కూడా కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
చిత్రం..నామా నాగేశ్వరరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్