రాష్ట్రీయం

వైసీపీతో ఏపీకి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, మార్చి 21: కోడికత్తి పార్టీ వైసీపీతో రాష్ట్రానికి చేటేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రను అభివృద్ధిలో పరుగు పెట్టిస్తానన్నారు. రౌడీ రాజ్యం కావాలో, సంక్షేమ రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో కోడి కత్తిపార్టీ వస్తే ఇంటికో రౌడీ, వీధికో గూండా తయారవుతారని ఎద్దేవా చేశారు. 12 కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ ఆర్థిక నేరగాడిగా 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి అని విమర్శించారు. క్విడ్‌ప్రోలో హిందూజాకి కేటాయించిన భూమిలో 11 ఎకరాలు దివంగత నేత, ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తన కుమారుడు జగన్‌కు హైదరాబాద్‌లో కేటాయించారని, కేసు సీబీఐ విచారణలో ఉండగా కేసీఆర్ వద్ద, మోదీ వద్ద జపం చేయడంతో కేసులో ఉపశమనం లభించిందన్నారు. ఈ విషయంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రజలకు వివరించాలని కోరారు. నేరాల్లో దిట్ట జగన్ అని చెబుతూనే రాష్టవ్య్రాప్తంగా ఫారం-7ను ఉపయోగించి 9 లక్షల ఓట్లు తొలగించే కార్యక్రమానికి తెరతీసాడని, త్వరలో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నారన్నారు. చిన్న తప్పుచేస్తేనే ఇంటిలోంచి బయటకి రాలేని పరిస్థితి మనందరిది అంటూ పేర్కొన్నారు. వైసీపీకి అధికారం ఇస్తే తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా తెలంగాణా వారికి ఊడిగం చేస్తారని, తన ఊపిరి ఉన్నంత వరకు ఆ పరిస్థితి రానివ్వనని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు స్వంత చిన్నాన్న హత్యకు గురైతే గుండెపోటుతో మరణించారని మొదట ప్రకటించి తర్వాత డ్రైవరే హత్యచేశాడంటూ వాంగ్మూలం సృష్టించారని చెప్పారు. గుండెపోటుతో మరణిస్తే మెదడు ఎందుకు చితిగిపోయిందని, రక్తపు మరకలు ఎందుకు తుడిచేశారని ప్రశ్నించారు. ఇలాంటివారు అధికారంలోకి రావడం అవసరమా అని ప్రశ్నించారు.
జిల్లాలో బొత్స సత్యన్నారాయణ ప్రవర్తన మరీ విచిత్రమని, గత పదేళ్లు అధికారంలో ఉన్న బొత్స జిల్లాలో ఎలాంటి అరాచకాలు సృష్టించారో అందరికీ తెలుసునన్నారు. జిల్లాలో బొత్స వస్తే కష్టాలు తప్పవన్నారు. ఎంతో కష్టపడి వోక్స్‌వేగన్ కంపెనీనీ విశాఖకు తీసుకొస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వారు బొత్స ఆధ్వర్యంలో ఆ కంపెనీ ఉద్యోగితో లాలూచి పడడంతో అతన్ని ఆ దేశం జైల్లో పెట్టిస్తే బొత్సకు మాత్రం రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో వోక్స్‌వేగన్ కంపెనీ పూనేకు తరలిపోయిందని చెప్పారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి పూసపాటి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు పూర్తయిందని, సాగునీరికి ఇబ్బంది లేకుండా ఉందన్నారు.
గతంలో ఎరువులు, పురుగు మందు, విత్తనాలు వంటి వాటిని రైతులు నల్లబజారులోను, పోలీస్ స్టేషన్ల వద్ద తీసుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మాత్రం సకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి మోది ఆశ్రయం కల్పిస్తున్నారని విమర్శించారు. రూ.43వేల కోట్లు దోచేసి 16నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి ఓటువేసి గెలిపిస్తే రాష్ట్రం 25 ఏళ్ల భవిష్యత్ పోతుందన్నారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా, ఎంపీలు పార్లమెంటుకు వెళ్లకుండా రాజ్యసభ సభ్యులు మాత్రమే హాజరై కేంద్రానికి ఊడిగం చేశారని ఎద్దేవా చేశారు. 725 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని, 230 అవార్డులు కేంద్రం నుంచి వచ్చాయంటే అది కేవలం చంద్రబాబునాయుడు కష్టమేనని చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతీ ఒక్కరి కష్టాల్లో పాలుపంచుకుంటానన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన దిశగా కృషిచేస్తానని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, జెడ్పీ ఉపాధ్యక్షుడు బలగం కృష్ణ, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు