రాష్ట్రీయం

పేదల గృహాలకు రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, మార్చి 23: రాష్ట్రంలో పేదల గృహాలకు 300 చదరపు అడుగుల వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం నిర్వహించిన ఎన్నికలో సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కేంద్రం లక్షన్నర సబ్సిడీ ఇచ్చిందని, రాష్ట్రం సుమారు రూ.6 లక్షల వెచ్చించి గృహాలు నిర్మించిందన్నారు. ఈ గృహాలకు రుణం భారంగా ఉందని ఆడబడుచులు అంటున్నారని ఆయన అన్నారు. అడపడుచులకు కానుకగా ఈ రుణం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 300 చదరపు అడుగుల వరకు నిర్మాణానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన వివరించారు. పేదలకు నిర్మించిన గృహాల్లో 300 చదరపు అడుగుల వరకూ రుణ మాఫీ చేస్తామన్నారు.
రాష్ట్రాన్ని అడ్డంగా విడదీశారని, ఆర్థిక లోటుతో ఈ రాష్ట్రాన్ని ఇచ్చి, భవనాలు, ఆస్తులు తెలంగాణాకు ఇచ్చారని, ప్రధాని మోదీ హోదా ఇవ్వలేదని, పైగా ఆస్తుల పంపకంలో రాష్ట్రాన్ని దగా చేశారని ఆయన విమర్శించారు. తనమీద ఎంతో నమ్మకంతో ప్రజలు నెగ్గించారని ప్రజలు ఆశలకు అనుగుణంగా తన పాదయాత్రలో చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడపానని ఆయన చెప్పారు. తనను పెద్దకొడుకుగా చూడాలని, పింఛన్లు 200 వెయ్యి, తరువాత రూ.2 వేలు పెంచానని, వారంతా ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. వారి కోడళ్లు అత్తగారిమీద ప్రేమ పెంచుకున్నారన్నారు. ఆడపడుచుల పట్ల తనకున్న అభిమానం వారికి పార్టీ పట్ల ఉన్న అభిమానం విడదీయరాని అనుబంధమని ఆయన అన్నారు. గతంలో పసుపు కుంకుమ కింద 10 వేలు ఇచ్చానని, ఇప్పుడు మరో 10 వేలు ఇచ్చానని, తనకు వీలున్నప్పుడల్లా ఆడపడుచులను ఆదుకుంటానని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి వంట గ్యాస్ అందించామని, ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి ఇచ్చామని ఇప్పుడు ఆడపడుచులు గౌరవంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ గిప్టు ఇస్తానన్నారు తమ్ముళ్లూ అనాగానే వద్దు వద్దు అని సభలో కేకలు వేశారు. మీ రోషం చూసా, ఎంత పౌరుషంగా జీవిస్తున్నారో చూపాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కష్టం మనదని, మన రాజధాని అని 60 ఏళ్లు అభివృద్ధి మీరు, మేము చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్, ఐఎస్‌బి సంస్థలను తెచ్చి ప్రపంచ పటంలో హైదారాబాద్‌ను సైబరాబాద్‌గా మార్చిన ఘనత తనదేని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉలవచారు తమ పశువులు తింటాయని, పలావులు తమ పేడతో సమానమని అంటే కోపం రాదా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అని ప్రతిస్పందించిన తమ్ముళ్లను చూసి తనకూ కోపం వచ్చిందని, కాని దిగమింగుకున్నానని అన్నారు. ఎవరు ఎన్ని అంటకాలు కల్పించినా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఓర్చుకున్నానని ఆయన చెప్పారు. తెలంగాణలో ఉన్న తెలుగువారికి రక్షణ లేకుండా పోయిందని, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. అన్నదాతను ఆదుకోవాలని 1.50 లక్షల రుణ మాఫీ చేశామని, ఏప్రిల్‌లో నాలుగు ఐదు విడతల సొమ్ము చెల్లించేందుకు ఆదేశాలిచ్చామని ఆయన చెప్పారు. ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం 9 వేలు ఇస్తామని చెప్పి తొలి విడతగా వెయ్యి రూపాయలు రైతుల ఖాతాలో జమచేశామన్నారు. కౌలు రైతులు కూడా మేలు కలిగే విధంగా విధానం రూపించినట్లు ఆయన చెప్పారు. చంద్రన్న బీమా ఉపయోగపడుతుందా అని అడగిన వెంటనే మంచి పథకం అన్నారు. పేదలకు పెళ్లిల్లు కూడా నేనే చేస్తున్నానని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ మాటలు గొప్పగా ఉంటాయని చేతలు శూన్యమని ఆయన విమర్శించారు. కోడికత్తి పార్టీ ఉందని ఆ నాయకుడిపై 31 కేసులు ఉన్నాయని ఆయన అఫిడవిట్ కాపీ చూపిస్తూ ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ఈ దేశంలోనే లేడని ఈయన అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఆలోచించాలని ఆయన కోరారు. అధికారంలోకి రాకుండానే తెలుగుదేశం వారిని జైలుకు పంపుతానని ప్రగల్బాలు పలుకుతున్నారని ఆయన అన్నారు. ఆయన ఎన్నో హామీలు ఇస్తున్నారని కానీ గెలిచినప్పుడు కదా అమలు చేసేది ఆయన అన్నారు. ఇక్కడ ఫ్యాన్ తిరగాలంటే కేసీఆర్ స్విచ్చ్ వేయాలని, మోదీ విద్యుత్ ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. మన రాష్ట్రాన్ని మనకు అన్యాయం చేసిన తెలంగాణకు తాకట్టు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ బాబ్జిని పేరు ఎత్తకుండా ఆయనకు తాను పిలిచి టిక్కెట్టు ఇచ్చానని, ఆయన పెద్ద వయస్సు వచ్చింది, మరో పదవి ఇచ్చి గౌరవిద్దామని చెబితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని, తరవాత బీజేపీకి వెళ్లారని, ఇప్పుడ వైసీపీలో పోటీ చేస్తున్నారని ఆయన పెద్దమనిషా అని చంద్రబాబు ప్రశ్నించారు. నిన్నటివరకు వైసీపీలో ఉన్న మరో అభ్యర్థి ఇప్పుడు జనసేనలోకి వెళ్లారని ఆయన అన్నారు. రాజకీయాలకు విలువలు లేకుండా పోయాయని ఆయన విమర్శించారు. పోలవరం పూర్తయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు, నరసాపురం పార్లమెంటు అభ్యర్థి వేటుకూరి శివరామరాజు, డీసీసీబీ చైర్మన్ రత్నం, ఏఎంసీ చైర్మన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. పాలకొల్లులో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
* సభలో పాల్గొన్న ప్రజలు