రాష్ట్రీయం

దొందూ దొందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, మార్చి 23: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దొందూ దొందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. చంద్రబాబు పాలన అవినీతి మయమైందని, ఆయనతోపాటు ఆయన టీం అంతా అవినీతిపరులని, అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని వారిని సాగనంపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వైఎస్ జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళ వద్ద తాకట్టుపెడుతున్నాడని ఆరోపించారు. కృష్ణా జిల్లా మైలవరం, నూజివీడుల్లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నూజివీడు మామిడికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చి, రైతుల కళ్ళలో ఆనందం నింపుతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మామిడి పంటపై ప్రత్యేక దృష్టి సారించి మామిడి కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేయటంతో పాటు మామిడి ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, తద్వారా కనీసం అయిదు వేల మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా వ్యవసాయ అధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు ప్రతి నెలా అయిదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ పధకంపై తొలి సంతకం చేస్తానని వెల్లడించారు. వైకాపా అధినేత ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. పాదయాత్ర సమయంలో వైకాపా నాయకులతో మంచినీళ్ళలా డబ్బులు ఖర్చు పెట్టించి తీరా నేడు వారికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకుండా వేరోకరికి ఇచ్చారని విమర్శించారు. ఆంధ్రులను ఇష్టానుసారంగా తిడుతున్న కేసీఆర్‌కు జగన్ దాసోహం కావటం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ ఆంధ్రులను తిడుతుంటే జగన్ ఎందుకు ఖండించలేకపోతున్నాడని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన తలసాని శ్రీనివాస యాదవ్ కృష్ణాజిల్లాకు వచ్చి ఆంధ్రులను విమర్శిస్తుంటే ఎందుకు నోరు మెదపటం లేదన్నారు. ఆంధ్రులకు పౌరుషం లేదా అని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ వద్ద తాకట్టు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అందుకే అటు తెలుగుదేశం, ఇటు వైకాపాలకు సమాన దూరం పాటిస్తున్నట్లు తెలిపారు. నీతివంతమైన పాలన జనసేనతోనే సాధ్యమన్నారు. అందుకే వామపక్షాలతో కలసి తాను పోటీకి దిగానన్నారు. తాము అధికారంలోకి రాగానే కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చే నిరుద్యోగ భృతి, పాతిక కిలోల బియ్యానికి ప్రజలు కక్కుర్తి పడవద్దని పాతికేళ్ళ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపు ఇచ్చారు. అటువంటి భవిష్యత్తు జనసేన ద్వారానే సాధ్యమవుతోందన్నారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అపూర్వమైన ఆదరణ లభిస్తోందని, జనసేనకు అధికారం ఇవ్వాలనే కసితో జనం ఉన్నారన్నారు. తాను అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా నెరవేర్చి ప్రజారంజకమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను చూడటానికి వేలాదిగా జనం తరలివచ్చారు. మైలవరంలో ఒక దశలో పవన్ కల్యాణ్ ప్రసంగించటానికి ఏర్పాటు చేసిన వేదిక పైకి కూడా ఆయన రాలేని పరిస్థితులలో చివరికి ఆయన వచ్చిన కారుపైకి ఎక్కి మాట్లాడాల్సి వచ్చింది. మైలవరం జనసేన అభ్యర్థి అక్కల రామ్మోహనరావును, తిరువూరు జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి నంబూరు శ్రీనివాసరావులను, నూజివీడు జనసేన అభ్యర్థి బసవ భాస్కరరావులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

చిత్రం.. నూజివీడు సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్