రాష్ట్రీయం

ఫిరాయింపుల చట్టానికి పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్రంలో అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదునుపెట్టి, మరింత కఠినతరం చేస్తామని ఏఐసీసీ నాయకుడు, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. పార్టీ ఫిరాయింపుల పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీరియస్‌గా ఉన్నారని ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మొయిలీ గాంధీ భవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సమావేశమై ఫిరాయింపులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి న్యాయపరమైన మార్పులు తీసుకొచ్చి కఠినతరం చేస్తామన్నారు. ప్రస్తుత చట్టంలో ఉన్న ఒకటి, రెండు చిన్న లోపాల కారణంగా ‘ఆయారాం-గాయారం’ తరహాలో ఫిరాయింపులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్టీ ఫిరాయింపులు బ్లడ్ క్యాన్సర్ వంటివని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఇలాంటి చర్యలపై దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామా లేఖలన్నీ ఒకే విధంగా టైప్ చేయిస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్‌సీ కుంతియా మాట్లాడుతూ తమ పార్టీ గుర్తుపై గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు వెంటనే తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతిని కలుస్తాం: ఉత్తమ్
టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపులపై త్వరలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. లోక్‌పాల్‌లో కేసు వేస్తామని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతో వీరప్ప మొయిలీ హైదరాబాద్‌కు వచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అక్రమ సంపాదనతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నదని దుయ్యబట్టారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌లో బేరమాడి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ప్రగతి భవన్‌లో రాజీనామా లేఖలు సిద్ధం చేశారని, అవన్నీ ఒకే విధంగా ఉన్నాయని అన్నారు. సీఎల్‌పి నేత భట్టివిక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అక్రమాలను ప్రతిపక్షాలు నిలదీయకుండా ఉండేందుకు ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.