రాష్ట్రీయం

ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని ప్రలోభాలకు గురి చేస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. శనివారం సీఎల్‌పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, ఎస్. జైపాల్ రెడ్డి, ఏఐసీసీ నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, సీఎల్‌పి మాజీ నేత కే. జానారెడ్డి, మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్ అలీ, జే. గీతారెడ్డి, టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వారు గవర్నర్‌ను కోరారు.
లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తాం..
అనంతరం కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై లోక్‌పాల్‌లో, సీఇసీకీ ఫిర్యాదు చేస్తామని అన్నారు. దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి మేరకు కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఫిరాయింపుల గురించి తాము చైర్మన్, స్పీకర్ వద్ద పిటీషన్లు దాఖలు చేసినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేల లేఖలన్నీ ఒకే విధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరామని మొయిలీ చెప్పారు. మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. అధికారం, డబ్బు ఉపయోగించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు.
చిత్రం.. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేతలు