రాష్ట్రీయం

దుష్ప్రచారాన్ని ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత సామాజిక మాద్యమాల్లో నకిలీ కథనాలు సృష్టిస్తున్నారని, దీని వల్ల తమ కుటుంబం మనోవేదనకు గురవుతోందని ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను ఆమె కలిశారు. ఫిర్యాదు కాపీలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీకి అందజేశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన తీరుపై ఇప్పటకే ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాలని ఆమె కోరారు. అవాస్తవాలతో తమ కుటుంబంపై బురద చల్లడానికి ప్రయత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. హత్యపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తుంటే మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సభల్లో తన తండ్రి హత్యను కుటుంబ కలహాలుగా చిత్రీకరించడం దారుణమని ఆమె అన్నారు. హత్యపై నిజానిజాలు భయటకు రాకుండా ఏపీ ముఖ్యమంత్రి తప్పుదోవపట్టిస్తున్నారని సునీత ఆరోపించారు. తన తండ్రిపై ఫెస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ , యూట్యూబ్‌లో అనుచిత ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. వైఎస్ వివేకానదరెడ్డి ప్రతిష్టను దెబ్బతీస్తున్న తప్పుడు ప్రచారాలను తక్షణం నిలిపివేయించాలని ఆమె కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు, వైఎస్ కుటుంబీకులపై అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై హైకోర్టుకు కూడా వెళ్లడం జరిగిందన్నారు. కోర్టు ద్వారా తమ కుటుంబానికి జరిగిన అన్యాయాలను బయటకు వస్తాయని ఆమె అన్నారు.

చిత్రం.. సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్ సునీతారెడ్డి