రాష్ట్రీయం

తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా వైదొలిగింది. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు సూచనలతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలంగాణ టీడీపీ నేతలు వెల్లడించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీపోటీ నుంచి తప్పుకున్నట్లు అయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుంతియా టీటీడీపీ నేతలతో భేటీ కావడంతో టీడీపీ నిర్ణయం ఆమర్చుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ 11న జరగబోయే ఓటింగ్‌లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని టీడీపీ పిలుపుఇచ్చింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఊహించిన ఆశావహుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కేడర్ తీవ్ర అసంతృప్తికి గురైంది. పార్టీ తీసుకున్న విధానంతో తెలంగాణలో టీడీపీకి జెండా పట్టే నాథుడే ఉండడని కేడర్ ప్రశ్నించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. మహాకూటమితో కాంగ్రెస్, సీపీఐ, టీజేసీ, టీడీపీ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసినప్పటికీ టీడీపీకి మాత్రం రెండు అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ అధిష్టానంకు సూచించినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. తొలుత కొన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న యోచనలో ఉన్న చంద్రబాబుపై కాంగ్రెస్ నేతల వత్తిడి పెరగడంతో ఆయన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. మల్కాజిగిరి, చేవేళ్ళ. సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుకు సూచించినప్పటికీ సానుకూల నిర్ణయం రాకపోవడంతో టీటీడీపీ నేతలు అంతృప్తికి గురయ్యారు.
రేణుకాచౌదరిని గెలిపిస్తాం
ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసి ఇటీవలే అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారికి గుణపాఠం చెప్పేందుకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఖమ్మంలో ఆదివారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు అనేక మంది భావోద్వేగానికి లోనై పార్టీ మారిన వారికి శాపనార్థాలు పెట్టారు. సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని)తో పాటు అనేక మంది ప్రధాన నేతలు పాల్గొని పార్టీ మారిన నాయకుల వైఖరిని ఎండగట్టారు. ఇదే సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా హాజరు కావటంతో ఆమెకు మద్దతుగా కొందరు నినాదాలు చేశారు. అనంతరం రేణుకా చౌదరి మాట్లాడుతూ తాను కూడా తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎన్టీ రామారావు హయాం తరువాత తాను కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడే ఉన్నానన్నారు. ఖమ్మం జిల్లా నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచి అనేక అభివృద్ధి పనులు చేశానని గుర్తుచేశారు. కార్యకర్తలు, ప్రజలను మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ ఎన్నికలను వేదికగా తీసుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె చెప్పారు. దీంతో టీడీపీ నేతలంతా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేణుకా చౌదరికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులను కలుపుకుపోతానని, మనోభావాలు దెబ్బతినకుండా కాపాడతామని వివరించారు. అనంతరం నేతలతో కలిసి టీడీపీ కార్యకర్తలు రేణుకా చౌదరికి గజమాల వేసి సత్కరించారు.